Rajahmundry Rajamahendravaram : మన ఇప్పుడు చూస్తున్న చారిత్రక కట్టడాలు కొన్ని దశాబ్దాల కిందట ఎలా ఉన్నాయనేది ఆసక్తి రేపుతూనే ఉంటుంది. అందుకే ప్రముఖ కట్టడాల ఆర్కైవ్స్ ఫొటోలు చూసి చాలామంది షాకవుతుంటారు.. పదే పదే చూసి ఆ చుట్టూ ఏం మారిందో తెలుసుకునేందుకు ముచ్చటపడుతుంటారు.
ప్రఖ్యాత రాజమండ్రి 1970లో ఎలా ఉందో అనే ఒక ఫొటోను మీరు ఈ ఆర్టికల్ లో నిషితంగా గమనించవచ్చు. ఆ ఫొటో చుట్టూ ఉన్న డీటెయిల్స్ .. నేటి డీటెయిల్స్ ను కూడా పక్కపక్కనే గమనించవచ్చు.
గోదారి గట్టు దగ్గర దుర్గమ్మ ఆలయం ఉండేదనీ.. ఆ సింహం నోట్లో నుంచి వెళ్లి ఆ టైపు నుంచి వచ్చే వాళ్ళని కొందరు చెబుతున్నారు. 1986 వరదలకు గోదావరి కలిసిపోవడం జరిగిందనీ.. 2003 పుష్కరాల్లో ఈ మొత్తం మారిపోయిందని కొందరంటున్నారు.
రాజమండ్రి మహా నగరం రెండు తెలుగు రాష్ట్రాల్లో అందమైన నగరం., చారిత్రాత్మకమైన నగరం. గత ముప్పై సంవత్సరాలుగా ఈ నగరాన్ని పట్టించుకొనే నాథుడు లేడు.. ఏ విధమైన మౌలిక సదుపాయాలుప్రభుత్వం కల్పించలేదు. అయినా సరే రెండు తెలుగు రాష్ట్రాల్లో లేని విధంగా భూముల రేట్లు పెరుగుతున్నాయి. రాజమండ్రి నగరంలో ప్రైమ్ లొకేషన్స్ లో ఖాళీ స్థలాలు దర్శనమిస్తాయి.
లాలాచెరువు నుంచి వేమగిరి వరకు వందల ఎకరాలు ఖాళీగా ఉంటాయి. రాజమండ్రి నడిబొడ్డున కూడా ఖాళీ స్థలాలు ఉంటాయి రేట్లు పెరుగుతాయి అని ఎదురుచూసే వారే ఎక్కువ వాళ్ళ ఆలోచన ప్రకారమే భూముల రేట్లు పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయో ఎవరికి తెలియదు.
రాజమండ్రి మహా నగరంగా మారాలంటే రాజమండ్రి కార్పొరేషన్ వారు ఖాళీ స్థలాల మీద భారీగా టాక్స్ లు విధించాలి, ఖాళీ స్థలాలలో భారీ కట్టదాలకు రాయితీలు ప్రకటించాలి, ఖాళీ స్థలాలలో విల్లాస్, షాపింగ్ మాల్స్, స్టార్ హోటల్స్ కి రాయితీలు కార్పొరేషన్ వారు ప్రకటిస్తే రాబోయే రోజుల్లో రాజమండ్రి మహానగరం రెండు తెలుగు రాష్ట్రాల్లో అందమైన నగరంగా మొదటి స్థానంలో ఉంటుంది.