మనోళ్లను దేకండి కొంచెం… ‘బ్యాన్ చైనా – రీప్లేస్ ఇండియా’నే మన మంత్రం

Chinese Apps India Band China;China Apps; BanChina;ReplaceWithIndia;
Spread the love

#బ్యాన్‌చేస్తే సరిపోదు
చైనీయుల‌ నడ్డి మీద తన్నడం ఓకే.. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మన దేశంలో మొదలైన అద్భుతమైన స్టార్టప్‌లను ఇక్కడి కార్పొరేట్ కంపెనీలు ఎందుకు సపోర్ట్ చేయవు?
మన దేశంలో గొప్ప కంపెనీలు ఏవీ అంటే‌.‌. టాటా, రిలయన్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్ అంటూ కేవలం నాలుగే వినిపిస్తాయి. అదే ఇతర దేశాల్లో చూస్తే ఫార్చూన్‌ ఫైవ్ హండ్రెడ్ అంటూ పేర్కొంటారు. నిష్ణాతులైన యువత.. ప్రతిభావంతమైన, ప్రయోజనకారియైన ఐడియాలతో వస్తుంటే వాళ్ళని దేకను కూడా దేకరు మన కార్పొరేట్లు.

దీనికి ఉదాహరణ.. నిన్నా మొన్న హాట్ టాపిక్ గా కనిపించిన కర్నాటకకు చెందిన మిని డ్రోన్ కుర్రాడు. అతను కనిపెట్టిన డ్రోన్‌ వల్ల డీఆర్డీఓలో జాబ్ ఇచ్చాడు ప్రధాని అని సంబర పడ్డారు. ఆ పిల్లాడు.. ఆ ప్రాజెక్ట్ వెనక పడ్డ కష్టం కూడా ఆ వైరల్ మెసేజ్‌లో క్షుణ్ణంగా ఉంది. అరకొర ఇంగ్లీష్‌తో వందల మెయిల్స్, 2018లో ఫారిన్‌ టెక్నో ఫెయిర్‌లో పాల్గొనడం.. అందులో అతనికి మొదటి బహుమతి రావడం, ఎన్నో సంస్థలు లక్షల శాలరీలు, రెండున్నర కోట్ల విలువైన కారు ఇస్తాననడం, బంగ్లా వగైరా వగైరా ఆఫర్లు ప్రకటించడం. కానీ వాటిని సున్నితంగా తిరస్కరించి.. నా సేవలు నా దేశానికే అంటూ ఆ అబ్బాయి తిరిగిరావడం. ఆ కథనం యావద్దేశంతో చప్పట్లు కొట్టిచ్చింది. కానీ.. ఎవరూ ఆలోచించని విషయం ఏంటంటే.. 2018లోనే ప్రఖ్యాతి గాంచిన ఆ అబ్బాయి ప్రతిభ మన దేశంలో మాత్రం రెండేళ్ళ తర్వాతే తెలిసింది. #సిగ్గుపడదామా? అలాంటి ఎందరో జీనియస్‌లు విసిగిపోయి తమ ఆశయాలను కాలరాస్కున్నారు. మేకిన్ ఇండియా పరిధి పెంచి ఇలాంటి యువతకు పెద్ద పీఠ వేస్తే.. ఇకపై రూపొందే వాటినైనా విదేశీ సంస్థల హస్తం పడకుండా కట్టడిచేయవచ్చు.

మనదేశంలో యువత మేథస్సు అద్వితీయం.. అందుకే చైనావాళ్ళూ, అమెరికా వాళ్ళు దుబాయ్ వాళ్ళు మనవాళ్ళ ప్రాజెక్ట్‌లను సొంతం చేసుకుంటున్నారు. ఏదైనా సంఘటన చోటుచేసుకున్నప్పుడు బ్యాన్ చైనా, బ్యాన్ అమెరికా అంటూ ఉద్యమాలు చేస్తున్నాం. అదే.. బై అవర్స్, బీ అవర్స్ అనేది వినిపించను కూడా వినిపించదు. జపాన్ బాగుపడ్డది, జర్మనీ నిలదొక్కుకుంది అని ఇన్‌స్పైర్ అవుతామే గానీ.. వాళ్ళెలా ఆచరించారో అలా చేయమని ప్రభుత్వాల మీద ఒత్తిడి మాత్రం చేయరు.

ఇకపై బ్యాన్ చైనా నినాదాల పక్కన.. రిప్లేస్ విత్ ఇండియా అనే ఒత్తిళ్ళను కూడా చేర్చండి. ఆ బిజినెస్‌లు బ్యాన్ అయినంత మాత్రాన గెలిచినట్టు కాదు.. దానికి ప్రత్యామ్నాయాన్ని సాధించడమే అసలైన గెలుపు‌.

నరేంద్ర.జి

(Visited 168 times, 1 visits today)
Author: kekanews