లక్ష్మినారాయణ బైబై.. పీకే ఓకే.. నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్

vv lakshmi narayana pawan kalyan
Spread the love

జనసేన పార్టీకి సంబంధించి ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఇది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరారు సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మినారాయణ(వీవీఎల్). వైజాగ్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల రిజల్ట్ తర్వాత మళ్లీ పవన్ కల్యాణ్ తో కనిపించలేదు. ఇపుడు జనసేన పార్టీని వీడారు. వెళ్తూ వెళ్తూ.. ఆయన చేసిన ఓ ఆరోపణ… దానికి పవన్ కల్యాణ్ ఇచ్చిన సమాధానం ఆసక్తిగానూ.. వాస్తవంగానూ.. ఇంకోవైపు ఫన్నీగానూ ఇలా మూడురకాలుగా అనిపిస్తున్నాయి.

జనసేనను వీడేందుకు లక్ష్మినారాయణ ఓ కారణం కోసం ఎదురుచూసి ఇప్పుడు ఓ సందర్భం దొరకగానే రాజీనామా చేసినట్టు అనిపిస్తోంది. పూర్తి కాలం రాజకీయాలకే పవన్ కల్యాణ్ పరిమితమై ఉంటానని చెప్పారనీ.. ఇపుడు సినిమాలు చేస్తుండటం నచ్చలేదని లక్ష్మినారాయణ తన రాజీనామా లెటర్ లో చెప్పారు. పవన్ కల్యాణ్ కు నిలకడైన విధి విధానాలు లేవంటూ ఆరోపణ చేసి పార్టీనుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు సీబీఐ మాజీ జేడీ. జనసేన వర్కర్లకు వ్యక్తిగతంగా అండగా ఉంటానని చెప్పి ముగించారు.

దీనికి పవన్ కల్యాణ్ నుంచి అంతే వేగంగా ఓ రిప్లై వచ్చింది. వీవీ లక్ష్మినారాయణ రాజీనామాను ఆమోదిస్తున్నామంటూనే… స్ట్రాంగ్ పంచ్ లు పేల్చారు పీకే. తనకు సిమెంట్ ఫ్యాక్టరీలు, పవర్ ప్రాజెక్టులు, పాల ఫ్యాక్టరీలు లేవన్నారు. తాను అధిక జీతం పొందే ప్రభుత్వ ఉద్యోగిని కూడా కాదన్నారు పవన్ కల్యాణ్. తనమీద ఆధారపడిన అనేక కుటంబాలను ఆదుకోవాలంటే.. తాను సినిమాల్లో నటించడం తప్పనిసరి అని పవన్ చెప్పారు.  ఇవన్నీ లక్ష్మినారాయణ తెల్సుకుంటే బాగుండేదని అన్నారు పవన్ కల్యాణ్. ఆయన రాజీనామా చేసినా.. వ్యక్తిగతంగా లక్ష్మినారాయణపై గౌరవం ఎప్పటికీ ఉంటుందని ముక్తాయించారు పవన్ కల్యాణ్.

పవన్ కల్యాణ్ సినిమాల్లో నటించడం కారణంతో పార్టీని వీవీఎల్ వీడటం.. సినిమాలు చేయనన్న పవన్ తనకు నటించడం తప్పనిసరి అని చెప్పడం.. ఏంటో.. ఇలాంటి పరిణామం నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ అని అనుకుంటున్నారు పరిశీలకులు.

(Visited 228 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *