పాకిస్థాన్ లో పిచ్చనాయాళ్లు.. నాటిన మొక్కల్ని పీకేశారు

Pakistan Plantation
Spread the love

అసలే వర్షాకాలం. మన దగ్గర హరితహారం, ట్రీ ప్లాంటేషన్ జరుగుతున్న సీజన్.

పాకిస్థాన్ లో కూడా అక్కడి ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ భారీస్థాయిలో మొక్కల పెంపకం ప్రోగ్రామ్ ప్రకటించారు. ఈ సీజన్ లో 35లక్షల మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఐతే… కొందరు స్థానికులు .. నాటిన మొక్కలు పీకేసి… మొక్కలు నాటేందుకు తీసుకొచ్చిన వస్తువులను లూటీ చేశారు.

ఈ వార్త ఇపుడు అంతటా వైరల్ అవుతోంది.

కైబర్ పక్తుంక్వాలో ఈ సంఘటన జరిగింది. ఓ మైదానంలాంటి ఏరియాలో భారీస్థాయిలో మొక్కలు నాటారు పాకిస్థానీ అధికారులు. స్థానికులు నల్లజెండాలతో అక్కడకు వచ్చి మొక్కలన్నీ వేళ్లతో సహా పీకేశారు. మొక్కలు ధ్వంసం చేశారు.

ఈ వీడియో వైరల్ అవుతోంది.

ఇందుకు 2 కారణాలు వినిపిస్తున్నాయి.

ఒకటి.. ఇస్లాం ప్రకారం.. మొక్కలు నాటడం కరెక్ట్ కాదని కొందరు అంటున్నారు. ఈ ల్యాండ్ వివాదాస్పద భూమి కాబట్టి అక్కడ నాటిన మొక్కలు పీకేశారని కొందరు చెబుతున్నారు. ఐతే… నాటిన మొక్కలు తొలగించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని స్థానిక అధికారులు వార్నింగ్ ఇచ్చారు.

(Visited 225 times, 1 visits today)
Author: kekanews