అమ్మను మంచంపై పెట్టి లాక్కెళ్లింది.. చూస్తే పాపం అనిపించక మానదు

Poor India
Spread the love

బ్యాంక్ అధికారుల ఓవరాక్షన్.. పెద్దవయసున్న ఓ కూతురును కష్టాలపాలుచేసింది. పింఛన్ డబ్బులు రావాలంటే… ఫిజికల్ వెరిఫికేషన్ ఉండాల్సిందేనని చెప్పడంతో… ఆ కూతురు.. తన వందేళ్ల తల్లిని.. మంచంపై పడుకోబెట్టి.. మట్టిరోడ్డుపై లాక్కుంటూ బ్యాంక్ కు తీసుకెళ్లింది. ఈ దారుణ సంఘటన ఒడిశా రాష్ట్రం నౌపారా జిల్లా బార్గావ్ ఊళ్లో జరిగింది.

గరీబ్ కల్యాణ్ యోజన స్కీమ్ లో భాగంగా.. పేదవారికి కేంద్రం నెలవారీగా రూ.5వందల రూపాయలు వారి జన్ ధన్ అకౌంట్లలో వేస్తోంది. పింఛన్ తీసుకునేందుకు ఆ కూతురు బ్యాంక్ కు వెళ్లింది. డబ్బులు ఇవ్వాలంటే.. ఫిజికల్ వెరిఫికేషన్ కావాలని… లబ్దిదారులను తీసుకుని రావాలని బ్యాంక్ అధికారులు ఆమెకు సూచించారు. దీంతో.. చేసేదేమీ లేక… ఆమె మంచంపై తన తల్లిని ఉంచి.. మంచాన్ని లాక్కుంటూ వెళ్లింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పై అధికారులను అడిగితే.. తాము వారి ఇంటికి వెళ్లేలోపే ఆమె తన తల్లిని మంచంపై పెట్టి లాక్కుని వచ్చిందని చెప్పారు

నెటిజన్లు ఈ సంఘటన తమను కలచివేసిందంటూ పోస్టులు పెట్టారు. ప్రభుత్వ పథకాలు వందేళ్ల వృద్ధులకు ఇంటివరకు చేరడం లేదని అన్నారు. మనసు చివుక్కుమనే వీడియో మీరూ చూడండి.

(Visited 79 times, 1 visits today)
Author: kekanews