పేరులోనే ఏముండదు… అదే నంబర్ లో అయితే ఇంకేముంటుంది అనుకుంటారు చాలామంది. కానీ… దుబాయ్ లో ఉండే బల్విందర్ సింగ్ సహానీ మాత్రం అలా కాదు. నంబర్ లోనే అంతా ఉంది అంటున్నాడీయన. తాను కొన్న కారుకు.. నంబర్ కోసం… కారు ధరకు ఆరు రెట్లు ఖర్చు చేసి నంబర్ దక్కించుకున్నాడు సాహ్నీ. అదృష్ట సంఖ్య దగ్గరుంటే.. అదీ అన్నీ తెచ్చిపెడుతుందని నమ్ముతున్నాడీ శ్రీమంతుడు.
భారత్ సహా అన్ని ప్రపంచదేశాల్లోనూ కారు ఫ్యాన్సీ నంబర్ల కోసం వేలం, బిడ్డింగ్ జరుగుతుంటుంది. దుబాయ్ రోడ్డు రవాణా సంస్థ కూడా ఓ ఫ్యాన్సీ నంబర్ కోసం ఇటీవలే ఆక్షన్ చేసింది. దుబాయ్ లో సెటిలైన మనభారతీయ బిజనెస్ మేన్ Balwinder Sahani బల్విందర్ సింగ్ సాహ్నీ… ఈ బిడ్డింగ్ లో పాల్గొని.. కళ్లుచెదిరే ధరకు తన లక్కీ నంబర్ దక్కించుకున్నాడు. బల్విందర్ ఏకంగా .. రూ.60కోట్ల భారీ మొత్తానికి కోట్ చేశాడు. ఇది వరల్డ్ రికార్డ్ అని చెబుతున్నారు.
డీ5 అనే నంబర్ ను బిడ్డింగ్ లో దక్కించుకున్నాడు బల్విందర్ సింగ్. డీ 5 అనేది తన లక్కీ నంబర్ అనీ.. దాన్ని తన రోల్స్ రాయిస్ ఫాంటమ్ కు ఉపయోగిస్తానని చెప్పాడు. గతంలోనూ ఓ ఫ్యాన్సీ నంబర్ బిడ్డింగ్ లో పాల్గొని రూ.45 కోట్లకు దక్కించుకున్నాడు. లక్కీ నంబర్ కోసం ఎందాకైనా వెళ్తాడనేందుకు ఇదో ఉదాహరణ.
అరబ్ దేశాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు బల్విందర్. 1990స్ లో ఆయన అక్కడకు ప్రవాసం వెళ్లాడు. RSG ఇంటర్నేషనల్ అనే సంస్థకు స్థాపించాడు. కోట్లు కూడబెట్టి… దుబాయ్ లో అపర కుబేరుడుగా మారాడు బల్విందర్. ఆయన గ్యారేజీలో వందకు పైగానే కార్లున్నాయి.
Read Also : రూ.10లకే పుస్తకం… బుక్ ఫెయిర్ లో బంపరాఫర్