హీరోగానే కాదు.. రైటర్ గా నాగశౌర్యకు బ్రేక్ గ్యారంటీ

nagashaurya aswathama trailer
Spread the love

నాగశౌర్య హీరోగా నటించిన ఇంటెన్సివ్ మూవీ అశ్వత్థామ. మేకింగ్ నుంచే ఆకట్టుకుంటున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. ప్రామిసింగ్ గా ఉంది. ఓ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందింది అశ్వత్థామ సినిమా. ట్రైలర్ వండ్రఫుల్ గా ఉంది. మూవీని చూసి థ్రిల్ పొందేందుకు రెడీగా ఉండాలని చెప్పకనే చెప్పేశారు మేకర్స్.

నాగశౌర్య మాస్ లుక్ లో… థ్రిల్లర్ లో కథను నడిపించే హీరోగా మెప్పించినట్టే కనిపిస్తున్నాడు. పైగా.. ఈ మూవీకి కథ కూడా నాగశౌర్యే రాశాడు. సో.. కథపై పూర్తి పట్టు ఉన్న నాగశౌర్య.. హీరోగా చెలరేగిపోయినట్టే కనిపిస్తోంది. యునానిమస్ గా ట్రైలర్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

ఐరా క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను రమణ తేజ రూపొందించారు. జిబ్రాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోరు మరోసారి ఆకట్టుకుంది. ఈ రేప్ అండ్ మర్డర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో మెహ్రీన్ హీరోయిన్ గా నటించింది.

 

(Visited 125 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *