నాగబాబుకు ఇంత బలుపా..! ప్రకాశ్ రాజ్ కాలి గోటికి కూడా కోట సరిపోడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు

Spread the love

MAA Elections : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు పోలింగ్ దాకా వచ్చేశాయి. ఐతే.. ఒక్కరోజు ముందు… మాటల యుద్ధం పతాకస్థాయికి చేరిపోయింది. ప్రకాశ్ రాజ్ ఏనాడూ షూటింగ్ కు టైంకు రాలేదు.. ఆయనకు క్రమశిక్షణ లేదు అని ఇటీవల సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఓ కామెంట్ చేశారు. దీనిని మెగా బ్రదర్, ప్రకాశ్ రాజ్ తరఫున మెగా మద్దతుదారు అయిన నాగబాబు ఓ తెలుగు టీవీ న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూలో తీవ్రంగా ఖండించారు.

ప్రకాశ్ రాజ్ కాలి గోటికి కూడా కోట శ్రీనివాసరావు లాంటివాళ్లు సరిపోరని సీరియస్ కౌంటర్ ఎటాక్ చేశారు నాగబాబు. నేషనల్ స్థాయి ఆర్టిస్టుగా ప్రకాశ్ రాజ్ ఎన్నో జాతీయ అవార్డులు గెల్చుకున్నారని చెప్పిన నాగబాబు…. ఆయన్ను చూసి.. కోట లాంటి నటులందరికీ కుళ్లు అని చెప్పారు. ఈ కుళ్లుతో కోట ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదన్నారు నాగబాబు.

నాగబాబు చేసిన కామెంట్స్ పై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తెలుగు సినిమాలో గ్రేటెస్ట్ యాక్టర్లలో ఒకడిగా కోట శ్రీనివాసరావుకు పేరుంది. విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. దాదాపు వెయ్యి సినిమాలతో కోట శ్రీనివాసరావు 40ఏళ్లుగా తెలుగు సినిమాపై చెరగని ముద్రవేస్తూనే ఉన్నారు. ప్రకాశ్ రాజ్ ఎంత గొప్ప నటుడైనా… ఆయన రేంజ్ ఏదైనా.. కోట లాంటి వర్సటైల్ ఆర్టిస్టును, సీనియర్ ను ఓ సాటి నటుడి కాలిగోటికి కూడా సరిపోరని నాగబాబు కామెంట్ చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

గణేశ్ సినిమాలో కోట చేసిన యాక్టింగ్ కు.. వంద సినిమాలు తీసినా ప్రకాశ్ రాజ్ సరిపోరని కోట వీరాభిమానులు అంటున్నారు. ఎవరి యాక్టింగ్ స్టైల్ వారిది… కోట స్టైల్ కోటది.. ఐతే… ప్రకాశ్ రాజ్ కోసం కోటను తక్కువ చేయడం కరెక్ట్ కాదని నాగబాబు హితవు పలుకుతున్నారు. తెలుగు ఇండస్ట్రీలోనే కోట గ్రేటెస్ట్ యాక్టర్ అనీ.. ఆయన కాలిగోటికి నాగబాబు సరిపోరని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. చిరంజీవి ఫ్యామిలీలోనూ నేషనల్ అవార్డు ఎవరికీ రాలేదనీ… మెగా ఫ్యామిలీలో ఎవరూ కూడా ప్రకాశ్ రాజ్ కాలిగోటికి సరిపోరనేనా మీ మాటల ఉద్దేశం అని రివర్స్ ఎటాక్ చేస్తున్నారు ఇంకొందరు. అసలు ఇన్ని ఎందుకు.. ప్రకాశ్ రాజ్ ఓడిపోవడానికి నాగబాబు ఇచ్చిన ఈ ఒక్క ఇంటర్వ్యూ చాలనేది ఇంకొందరి వెర్షన్. ఈ పొగరుబోతు మాటలే విష్ణును గెలిపిస్తాయని అభిప్రాయాలు వ్యక్తంచేశారు.

(Visited 143 times, 1 visits today)
Author: kekanews