Tirumala Laddu : తిరుమల లడ్డూ కల్తీ అత్యంత బాధాకరమన్నారు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi). హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. లడ్డూలో కొవ్వు కలిసిందన్న వార్తలు హిందువులను మనసులు గాయపరుస్తాయనడంలో సందేహం లేదన్నారు. వక్ఫ్ బోర్డ్ చట్ట సవరణ కూడా అలాంటిదే అన్నారు. తిరుపతి దేవస్థానం ప్రసాదంలో జంతువుల కొవ్వు ఉండటం వల్ల స్పందించిన వారు ముస్లిం మతంలో భాగమైన వక్స్ బోర్డుపై ఎందుకు అలా స్పందించడం లేదని ప్రశ్నించారు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.
వర్ఫ్ బోర్డుపై వివక్ష తగదని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. బుధవారం ముంబైలో ఆయన మీడియాతో మాట్లాడారు. వక్స్ సవరణ బిల్లుపై బీజేపీ ప్రభుత్వం తప్పుడు ఎజెండాలు సృష్టించి, ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 9 లక్షల 40 ఎకరాల భూమి ఉందని,
అయితే ఆ భూముల్ని లాక్కున్నట్లు పుకార్లు వ్యాపిస్తూనే ఉన్నా యన్నారు. ఈ చట్టం అమలు వక్స్ ఆస్తులను కాపాడేందుకు కాదని, వక్స్ బోర్డును శాశ్వతంగా రద్దు చేసేందుకు బీజేపీ ప్రభుత్వం బిల్లును తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర వర్ఫ్ బోర్డు కమిటీలో 8 నుంచి 9 మంది ముస్లిమేతరులను ఎందుకు నియమించాలనుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. యూపీలోని కాశీ బోర్డులో సభ్యుడు తప్పనిసరిగా హిందువు అయి ఉండాలని స్పష్టంగా రాసి ఉందని, కాబట్టి వక్స్ బోర్డులోకి హిందువులను ఎందుకు తీసుకురావాలని ఆలోచిస్తున్నారని ఒవైసీ ప్రశ్నించారు.
(Visited 5 times, 2 visits today)