ఆర్టికల్ 370పై సినిమా

” A — 370 ” లోగో లాంచ్

మూన్ లైట్ మూవీ మేకర్స్ & ఆర్నావ్ ఫిలింస్.

బ్యానర్: మూన్ లైట్ మూవీ మేకర్స్
బ్యానర్: ఆర్నావ్ ఫిలిమ్స్
టైటిల్: A – 370

ఇది ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న పరిస్థితులకు సంబంధించిన కథ.
ఇది ప్రతీ ఒక్క వ్యక్తికి సంబంధించిన కథ. సాధారణ జీవితం గడపడానికి మనలో కొంత మంది ఎంత పోరాడుతున్నారో, ఎలా బాధపడుతున్నారో, తెలిపే కథ. గతంలో కోల్పోయిన దానికి.. ఏది ఏమైనా ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూస్తున్న కథ.
ఇది ఆసిఫ్ అనే ఒక సాధారణ మెకానిక్ కథ. సిటీ వదిలేసి పూర్తిగా తన గ్రామానికి వెళ్లిపోవాలనుకుంటున్న సమయంలో మిత్రుల ప్రోద్భలంతో ఒక రాత్రి గడిపేందుకు ఓ వేశ్య దగ్గరకు వెళతాడు. కాకతాళీయంగా ఆ వేశ్యకు కూడా అదే చివరి డ్యూటీ. తాను కూడా ఇవన్నీ వదిలేసి తన సొంతూరికి వెళ్లాలనే ఆలోచనలో ఉంటుంది.
వారి సంభాషణ నెమ్మదికా ఊహించని మలుపులు తిరుగుతుంది.
దీనికి సమాంతరంగా దేశంలో ఒక సీరియస్ ఇష్యూ నడవబోతోంది.
ఈ జాతీయ అంశం మన కథలోని క్యారెక్టర్స్ తో ఎలా కనెక్ట్ అయ్యింది. వారికి ఏం జరిగింది..? అదే A – 370 చిత్ర ప్రధాన ఇతివృత్తం. కన్నడ. తెలుగు బాషలలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డిల్లీ, కాశ్మీర్, కులు మనాలి, కూర్గ్ లలో అందమైన ప్రదెశాలలో షూటింగ్ జరుపుతామాని దర్శక నిర్మాతలు తెలిపారు.

నటీనటులు:

విష్ణు వర్ధన్
వర్ష
సంతోష్
రాఘవేంద్ర మోక్షగుండం
సందీప్ మిలాని

సాంకేతిక నిపుణులు:
మ్యూజిక్: ఆర్.ఎస్. గణేష్ నారాయణన్
కెమెరామెన్: విష్ణు వర్ధన్
ఎడిటర్: కార్తిక్ కె.ఎమ్
పీ.ఆర్.ఒ: లక్ష్మీ నివాస్
కథ – స్క్రీన్ ప్లే – మాటలు – నిర్మాత – దర్శకత్వం: విష్ణువర్ధన్

(Visited 185 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *