మీ HD టీవీని ఇలా స్మార్ట్ టీవీగా మార్చేయండి

Mi Box 4K Vs Amazon Fire TV Stick Hd
Spread the love

Mi Box 4K.. Amazon ఫైర్ స్టిక్ ఏది కొనాలి..?

చాలా మంది ఇళ్లలో HD, FHD టీవీలు ఉంటాయి. కొత్తగా స్మార్ట్ టీవీను కొనుక్కోకుండా.. వీటిని సింపుల్ గా స్మార్ట్ టీవీలుగా మార్చేయొచ్చు. Amazon ఫైర్ TV స్టిక్ ఉపయోగించి.. చాలామంది తమ ఇళ్లలోని HD టీవీలను స్మార్ట్ గా మార్చేస్తున్నారు. ఐతే.. ఇపుడు Mi Box 4K రాకతో కాంపిటీషన్ మొత్తం మారిపోయింది.

Mi Box 4K.. అమేజాన్ ఫైర్ స్టిక్ ను మించిన ఫీచర్స్ తో వస్తోంది. HD టీవీలకు ఉపయోగించే అమేజాన్ HD ఫైర్ స్టిక్ కాస్ట్ 4వేలు కాగా.. Mi Box 4K కాస్ట్ 3,500 మాత్రమే. అమేజాన్ 4కె ఫైర్ స్టిక్ కాస్ట్ ఆరువేల రూపాయలు.

Mi బాక్స్ 4కె డివైజ్ లో.. అదనంగా..   Usb, HDMI పోర్ట్, 3.5 ఆడియో జాక్ కేబుల్ కనెక్టివిటీ ఫెసిలిటీ ఉంది. పైగా..ఒక్క Mi బాక్స్ నే HD, FHD, 4K టీవీలకు వాడుకోవచ్చు. ఇది మల్టీ పర్పస్ గా యూజ్ చేయొచ్చు. ఎంఐ వాళ్ల ప్రొడక్ట్ ఆండ్రాయిడ్ ఓఎస్ పై పనిచేస్తుంది.

కొన్నాళ్లుగా మార్కెట్ ను అమేజాన్ ఫైర్ స్టిక్ ఏలింది. ఇపుడు Mi బాక్స్ .. ఆ ప్లేస్ ను రీప్లేస్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కొన్ని స్మార్ట్ టీవీల్లో కొన్ని యాప్స్ మాత్రమే వస్తుంటాయి. అలాంటి స్మార్ట్ టీవీలకు కూడా ఎంఐ బాక్స్ కచ్చితంగా ఉపయోగపడుతుంది.

 

(Visited 215 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *