గమనించారా.. చిరంజీవిలో చిలిపితనం పెరిగిపోతోంది

megastar chiranjeevi Chilipithanam kekanews
Spread the love

మెగాస్టార్ చిరంజీవి… ఏజ్ పెరుగుతున్నకొద్దీ చిన్నపిల్లాడిలాగా మారిపోతున్నాడా అన్నంత చిలిపిగా అల్లరి చేసేస్తున్నాడు. ఆ వేదిక.. ఈ వేదిక అనే తేడాలేదు.. సందు దొరికితే.. మెగాస్టార్ హాజరైన వేడుకకు.. తానే హైలైట్ అవుతున్నాడు. రాజకీయాల కారణంగా దశాబ్దకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న చిరంజీవి.. అప్పట్లో ఏ సినిమా ఫంక్షన్లలో పాల్గొన్నా.. హుందాగా మాత్రమే ఉండేవాడు. పెద్దగా సరదాగా ప్రవర్తించేవాడుకాదు. కానీ.. ఈ మధ్య ట్రాక్ మార్చాడు. ఫంక్షన్ ఏదైనా.. తనదైన మార్క్ చిలిపితనంతో… అందరిలోనూ నవ్వులు పూయిస్తున్నాడు మెగాస్టార్.

సరిలేరు నీకెవ్వరు ప్రి రిలీజ్ ఈవెంట్  కు చీఫ్ గెస్ట్ గా హాజరైన చిరంజీవి.. విజయశాంతితో తన స్నేహాన్ని గుర్తుచేసుకుంటూ…  షోకే హైలైట్ అయిపోయాడు. జరుగుతున్న సరిలేరు నీకెవ్వరు వేడుకేనా అన్నంతగా.. కొద్దిసేపు అందరినీ తన మాయలో పడేశాడు చిరంజీవి. విజయశాంతితో తాను 20 సినిమాలు చేశాననీ.. అప్పుడు తమమధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉండేదని.. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు విజయశాంతి తనను విమర్శించినప్పుడు బాధ కలిగిందని అన్నాడు. తాను మాత్రం విజయశాంతిని ఒక్క మాట కూడా అనలేదన్నాడు. విజయశాంతి చిరంజీవి గురించి పెద్దగా చెప్పకపోయినా… చిరంజీవి మాత్రం మొత్తం విజయశాంతితో తన స్నేహాన్ని హైలైట్ చేస్తూ మాట్లాడాడు. ఈ సందర్భంగా.. ఎన్నో చిలిపి ఎక్స్ ప్రెషన్స్.. చిలిపి మాటలు… హగ్గులు… సిగ్గుపడటాలు.. అన్నీ చూపించేశాడు మెగాస్టార్. కృష్ణకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు డిమాండ్ చేసినా.. మహేశ్ బాబు గురించి ఏం మాట్లాడినా మామూలే. కానీ… ఫన్ జెనరేట్ అవ్వాలంటే… గతంలో తన ఫ్రెండ్ అయిన విజయశాంతి విషయంలోనే వర్కవుటుతుందని చిరంజీవి ఆమెను ఫోకస్ చేశాడు. ఫంక్షన్లలో లేడీస్ విషయంలో సరదాగా మాట్లాడాల్సి వస్తే.. చిరంజీవిలోని చిలిపితనం తన్నుకుంటూ బయటకొచ్చేస్తోంది ఈ మధ్య.  

ఇటీవలే మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం రాజశేఖర్ కారణంగా రచ్చరచ్చ అయింది కానీ.. ఆ షోలోనూ చిరంజీవి చాలా జోవియల్ గా కనిపించాడు. రాజశేఖర్ ను ఉద్దేశించి.. సరదాగా మాట్లాడాడు. కామెడీ.. చమక్కులు.. సరదా కట్టింగ్ లు.. సీరియస్.. వార్నింగ్ లతో… చిరంజీవి ఆ ప్రోగ్రామ్ కు హైలైట్ అయిపోయాడు. పెద్దపెద్ద వేదికలపై తనను ఘాటుగా విమర్శించిన మోహన్ బాబుతో తనకు విభేదాల్లేవంటూ.. వెనుకనుంచి హగ్ చేసుకుని ముద్దుకూడా పెట్టేశాడు చిరంజీవి. ఇదైతే పీక్స్ అనుకోవచ్చు. హేమ పేరు మరిచిపోయినప్పుడు కూడా.. ఆమె అందం పెరిగిపోయి పేరు మరిచిపోయేలా చేస్తోంది అని అప్పటికప్పుడే కౌంటర్ ఇచ్చేశాడు చిరు.

చిరు టీవీలో యాంకర్ గా ఫెయిల్.. కానీ.. ఆ రియాలిటీ షోలో హల్చల్

చిరంజీవి ఈ తరహా చిలిపితనం… ఆ మధ్య నాగార్జున బిగ్ బాస్ 3 ఫైనల్ ఎపిసోడ్ లో బాగా పేలింది. చిరంజీవి తన మార్క్ డైలాగులు… చిలిపి సెటైర్లు.. కామెడీ పంచులతో… కంటెస్టెంట్స్ ను నవ్వులతో ముంచెత్తాడు.  నాగార్జునకు హోస్టింగ్ లో కూడా పోటీ ఇచ్చాడు. అందుకే.. బిగ్ బాస్ 3 ఫైనల్ ఎపిసోడ్ అంత వైరల్ అయింది.

చిరంజీవి తన పూర్తికాలం ఇకనుంచి సినిమాల్లో కొనసాగించాలని డిసైడైనట్టు టాక్. అందుకే.. ఇండస్ట్రీకి ఎక్కువ టైమ్ కేటాయించాలనుకుని.. ఇలా.. తనలోని మునుపటి చిరంజీవిని చూపిస్తున్నాడని చెప్పుకోవచ్చు. రాజకీయాల్లో ఊరికే శత్రువులు పెరుగుతారనీ.. ఇండస్ట్రీ మిత్రులు ఎప్పటికీ అలాగే ఉండిపోతారని విజయశాంతిని ఉద్దేశించి చెప్పిన మాటలు ఇదే చెబుతున్నాయి.

(Visited 151 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *