చాయ్ అమ్మేఅతడి కూతురు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్

Aanchal Gangwal
Spread the love

ఆంచల్ గంగ్వాల్.

భారత జాతి స్త్రీ శక్తికి మారుపేరు.

అన్ని రంగాల్లోనూ.. ముఖ్యంగా గగన యానంలోనూ భారత మహిళలు సత్తా చాటగలరని మరోసారి చాటిచెప్పిన వీరవనిత.

పెద్దింట్లో పుట్టినవాళ్లు… మాత్రమే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు సంపాదిస్తారనేది వాస్తవం కాదు. పేదింట్లో పుట్టినా.. పెద్ద చదువు చదివి… పైలట్ ఆఫీసర్ కాగలదని నిరూపించిన అమ్మాయి ఆంచల్ గంగ్వాల్.

ఆంచల్ గంగ్వాల్ ది మధ్యప్రదేశ్ రాష్ట్రం. ఆమె తండ్రి సురేష్ గంగ్వాల్ నీముచ్ జిల్లాలో ఓ చిన్న టీ స్టాల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. భార్యతో కలిసి టీ అమ్ముతూ కూతురును చదివించాడు. ఆంచల్… పైలట్ కావాలని చిన్నప్పుడే అనుకుంది. అకుంఠిత దీక్షతో చదువుకుని…. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎకాడమీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది.

2020 జూన్ లో ప్రెసిడెన్సీ పరేడ్ లో పాల్గొంది ఆంచల్. జులైలో… ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ స్థాయిని అందుకుంది.

చిన్నప్పుడు కన్న కలను సాకారం చేసుకుంటూ.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ యూనిఫామ్ లో ఫొటోలకు సగర్వంగా పోజులిచ్చింది. తన తల్లిదండ్రులకు, దేశానికి గర్వకారణంగా నిలిచింది. సెల్యూట్ ఆంచల్ గంగ్వాల్. నీవు జీవితంలో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాం.

 

(Visited 67 times, 1 visits today)
Author: kekanews