Meenakshi Chaudhary : మీనాక్షి చౌదరి భారతదేశానికి చెందిన మోడల్, సినిమా నటి. ఆమె 2018లో ఫెమినా మిస్ ఇండియాగా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచి 2021లో విడుదలైన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో హీరోయిన్గా తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది.
హిట్ 2, గోట్, గుంటూరు కారం సినిమాలతో వలపు వల వేసింది మీనాక్షి చౌదరి. ఐతే.. సరైన బ్రేక్ మాత్రం రాలేదు. టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ కేక్ ఈ పంజాబీ ముద్దుగుమ్మ. లక్కీ భాస్కర్ లాంటి హిట్ పడటంతో.. అమ్మడి కెరీర్ ఊపందుకుంది. మట్కాతోనూ సై అంటోంది. మరిన్ని క్రేజీ ప్రాజెక్టులు అమ్మడి బ్యాగ్ లో చేరిపోయాయి. సూపర్ ఫిగర్ అమ్మడి సొంతం. నవ్వుతో పాటు.. అలరించే అందం ఆమెకు పెట్టని ఆర్నమెంట్. అందుకే.. అవకాశాలు క్యూ కడుతున్నాయి.
మీనాక్షి చౌదరి 1997 మార్చి 5న హరియాణాలోని పంచ్కులాలో జన్మించింది. పంజాబ్‌లోని నేషనల్ డెంటల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో డెంటల్ సర్జరీ కోర్సు చేసింది. మయన్మార్- యాంగోన్ లో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 అందాల పోటీలో మొదటి రన్నరప్ టైటిల్ ను గెలుచుకున్న తర్వాత ఫెమినా మిస్ ఇండియా 2018 పోటీలో మిస్ గ్రాండ్ కిరీటాన్ని, 2018 మిస్ ఇండియా పేజెంట్ టైటిల్ ను అందుకుంది.