బాహుబలి, మహేశ్ బాబు, ఎన్టీఆర్ ఏడ పన్నరు.. డుగుడుగు రేసుగుర్రం ఏడపోయిండు

Justice For Disha; OU Student Mahipal Yadav;
Spread the love

ఎవ్వర్నీ వదల్లేదు.. అందర్నీ ఏసుకున్నాడు..

దిశ(వెటర్నరీ డాక్టర్)కు న్యాయం జరగాలంటూ యూత్ దేశమంతటా ఆందోళనచేస్తోంది. ఈ పరిస్థితికి కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తోంది. ఢిల్లీ నుంచి.. గల్లీ వరకు దేశమంతటా మహిళలు, యువతీయువకులు తమ ఆక్రోశాన్ని , ఆగ్రహాన్ని చూపిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఓయూ స్టూడెంట్ మహిపాల్ యాదవ్ సమాజాన్ని, సినిమా ఇండస్ట్రీని, హీరోలను ప్రశ్నిస్తున్న వీడియో వైరల్ అవుతోంది.

ఓయూ స్టూడెంట్ మహిపాల్ యాదవ్ ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం.

జూనియర్ ఎన్టీఆర్, బాహుబలి ప్రభాస్, సైరా చిరంజీవి, విక్రమార్కుడు, రేసుగుర్రం, ఏడున్నర్రా. ఏడ పన్నర్రా. మీరు జనంలోకి వస్తే లక్షల మంది మీతో వస్తరు. మీరు బయటకు రాకపోతే హీరోలు కాదు… డమ్మీగాళ్లు అంటున్న.

రాఖీ సినిమాల అమ్మాయిలు తల్లులన్నడు జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు ఏడ పన్నడు.

సైరా నర్సింహారెడ్డి చిరంజీవి సినిమాల్లోనే నరుకుతాడా.. ఇప్పుడు నరకడా అని అడుగుతున్నా. విక్రమార్కుడు ఎటుపోయిండు.

డుగుడుగుడుగు అనుకుంట వస్తడు రేసుగుర్రం .. నీ డుగుడుగు ఏమైందిరా. ఏడున్నవ్ రా.

బాహుబలి అట. తాటిచెట్టు ఎక్కి ఎగిరి ఆ కోటల దుంకుతడు. ఇప్పుడు ఏడ దుంకుతున్నవ్ రా.

కొడితె దిమ్మతిరిగిమైండ్ బ్లాక్ ఐతదంటడు మహేశ్ బాబు. సినిమాలల్లనే కొడ్తవారా. ఏందిర..  ఇప్పుడు కొట్టవారా. 

రాజమౌళి, కొరటాల శివ… సినిమాలల్ల నీతులు కాదు.. బయటకు రండి.

బిగ్ బాస్ గా.. నాగార్జున.. అన్నపూర్ణ స్టూడియోల వందల ఎకరాల కబ్జా చేసినవని కేసీఆర్ చెప్పిండు. సినిమాల్లో భూములు కబ్జా చేసినోళ్లను ఈ హీరోలు తంతరు.  నిజజీవితంలో సినిమా భూములు కబ్జాచేసినోడి పక్కనే కూర్చుంటరు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నరు.

చిరంజీవి .. జయప్రదతో ఎగురుతుండు. 60 ఏండ్ల వయసులో ఎగురుడు కాదు. మాకోసం ఏదైనా చేయండి.

మీరు బయటకొస్తే మిమ్మల్ని చూసేందుకు జనం బయటకు వస్తరు. ఇప్పుడు మీరు రాకపోతే.. రేపిస్టులను కాదు మిమ్మల్నిసంపుతం. అలా ప్రభుత్వంపై గట్టి చట్టంకోసం ఒత్తిడి తెస్తం.

ఘంటా చక్రపాణి, గోరటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్, మంగ్లీ, మధుప్రియ… తెలంగాణ ఉద్యమంలో ఉన్నోళ్లందరూ బయటకు రావాలి.

కేసీఆర్… మా ఆడపిల్లలకు చీరలు కాదు.. భద్రత కావాలి.

ప్రతి గ్రామానికి ఇంటలిజెన్స్ రిపోర్ట్ పెట్టాలి. మాకు పెళ్లిచేసుకోవాలన్నా.. పిల్లలను కనాలన్నా భయమైతుంది.

చదువులు పక్కన పెడ్తాం. సైకోగాళ్లను పట్టే చట్టం కోసం ఉద్యమిస్తాం. ఆడపిల్లలను కాపాడుకుందాం.” అని చెప్పారు మహిపాల్ యాదవ్.

Read Also : సీఎం, కార్మికులకు ఏం కాలె..! జనానికే మూడు రకాలుగా బొక్క

(Visited 208 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *