ఇంటర్ ఫస్టియర్లో జాయిన్ అయిన విద్యాశాఖ మంత్రి

jarkhan minister
Spread the love

విద్యాశాఖ మంత్రి అంటే వెల్ ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి. కానీ… మన దేశంలో ఎటువంటి అర్హతలు లేకపోయినా.. ఏ పొజిషన్ కైనా వెళ్లొచ్చు. మన దేశంలోని రాజకీయ నేతల తీరుతెన్నులను తెలియచేసే వార్త ఇది.

జార్ఖండ్ లో హెచ్చార్డీ మంత్రి.. అంటే విద్యాశాఖమంత్రి గా ఉన్నారు జగర్నాథ్ మహతో. హేమంత్ సొరేన్ సారథ్యంలోని జేఎంఎం ప్రభుత్వంలో ఆయన భాగస్వామి. విద్యాశాఖ మంత్రి కాబట్టి.. బాగా చదువుకున్నారని అనుకుంటే తప్పులో కాలేసినట్టే.

జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి చదువుకున్నది గట్టిగా టెన్త్ క్లాస్ మాత్రమే. అంత తక్కువ చదువు చదివి.. విద్యామంత్రిగా ఉండటంపై చాలా పెద్ద చర్చే జరుగుతోందట. అందరూ విమర్శిస్తున్నారట. రీసెంట్ గా హెచ్చార్డీ శాఖను విద్యాశాఖగా మార్చినప్పుడు అందరు విద్యాశాఖ మంత్రులు మీటింగ్ లో పాల్గొన్నారు. జార్ఖండ్ విద్యామంత్రి క్వాలిఫికేషన్ కేవలం టెన్త్ క్లాస్ కావడంతో.. దీనిపై పెద్దగా చర్చ జరిగిందట.

అందుకే.. తాను ఇంటర్ ఫస్టియర్ జాయిన్ అవుతున్నట్టు ప్రకటించారు విద్యామంత్రి జగర్నాథ్ మహతో. “పదకొండో తరగతిలో ఎన్ రోల్ చేసుకుంటున్నా. కష్టపడి చదువుకుంటా.” అన్నారు విద్యాశాఖ మంత్రి మహతో.

(Visited 157 times, 1 visits today)
Author: kekanews