అద్భుతమంటే ఇదే..! ‘ముక్కాలా’ స్టేజ్ డాన్సర్.. ఇపుడు శంకర్ మూవీకి కొరియోగ్రాఫర్

జానీ మాస్టర్ కు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. హీరో విజయ్ మాస్టర్ మూవీతో తమిళ్ లో రీసెంట్ గా బ్లాక్ బస్టర్ కొట్టాడు. పలు భాషల్లో జానీ మాస్టర్ .. వరుస సక్సెస్ లతో.. దూసుకుపోతున్నాడు.

క్రేజీ స్టెప్స్ ఇచ్చే ఈ డాన్స్ మాస్టర్ కు… ఇపుడు అరుదైన అవకాశం దక్కింది. రామ్ చరణ్ మూవీకి ఇప్పటికే పలు సినిమాల్లో కొరియోగ్రఫీ చేశాడు జానీ మాస్టర్. ఐతే.. శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ లేటెస్ట్ గా ఓ ప్రెస్టీజియస్ మూవీ చేస్తున్నాడు. ఆ మూవీలో పాటలకు కొరియోగ్రఫీ అవకాశం దక్కించుకున్నాడు జానీ మాస్టర్.

శంకర్ డైరెక్షన్ చేసే మూవీకి కొరియోగ్రఫీ చాన్స్ రావడం మాటలు కాదు. ప్యాన్ ఇండియా లెవెల్, ఇంటర్నేషనల్ ఇండియన్ గ్రూప్ లో గుర్తింపు వస్తుంది. ఐతే.. తనకు వచ్చిన అవకాశం గురించి. .. ట్విట్టర్ లో ఇంట్రస్టింగ్ పోస్ట్ పెట్టాడు జానీ మాస్టర్.

తాను ఒకప్పుడు ప్రేమికుడు సినిమాలోని ముక్కాలా ముకాబ్ లా పాటకు.. ఒకప్పుడు స్టేజీపై పెర్ఫామ్ చేశానని గుర్తుచేశాడు. శంకర్ తీసిన బాయ్స్  మూవీలో బ్యాక్ గ్రౌండ్ డాన్సర్స్ లో ఒకడిగా కనిపించాడట. ఐదువందల మందిలో ఒకడిగా ఉన్నాడట. అలాంటి తాను.. ఇపుడు శంకర్ తీస్తున్న సినిమాకు కొరియోగ్రాఫర్ గా మారడం.. జీవితంలో మరిచిపోలేని అనుభూతి అని చెప్పాడు జానీ మాస్టర్. అందులోనూ.. తన ఫేవరిట్ హీరో కావడంతో.. తన ఆనందానికి అవధులు లేవంటున్నాడు. ఇది నమ్మశక్యంగా లేదని.. తనపై నమ్మకం ఉంచినందుకు థాంక్స్ అంటూ ట్వీటాడు జానీ మాస్టర్.

 

(Visited 56 times, 1 visits today)