ఇలియానా సర్.. ఇలియానానే. తెలుగు ప్రేక్షకులను తన నడుముకు చుట్టేసుకున్న గోవా భామ ఇలియానా. తెలుగుకు దూరమై.. బాలీవుడ్ లో ప్రయత్నించి.. పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ ను బాధ పెట్టిన ఇలియానా.. ఆ తర్వాత బ్రేకప్ చెప్పేసి.. మళ్లీ మేకప్ వేసుకుంటోంది. దీంతో.. ఆమె అందాన్ని ఆరాధించేవాళ్లు సంబురపడ్డారు.
ఇండస్ట్రీలో మునుపటి క్రేజ్ కోసం ఇలియానా తపిస్తోంది. అందుకు గ్లామర్ ఫొటో షూట్లతో తనవైపుకు తిప్పుకుంటోంది. తనలో అందాల ఆకర్షణ తగ్గలేదని చెబుతూ.. హాట్ హాట్ కాస్ట్యూమ్స్ లో అందాలు ప్రదర్శిస్తోంది ఇలియానా.