TamilRockers, Movie Rulez సైట్లకు వచ్చే లాభం ఏంటి..?

movie piracy
Spread the love

కొత్త సినిమా రిలీజ్ కావడమే లేటు.. మ్యాట్నీ షోకల్లా ఆన్ లైన్ లో దొంగతనంగా అప్ లోడ్ అవుతున్న రోజులివి. ఎంత టెక్నాలజీ వాడినా… ఎంత నిఘా పెట్టినా.. మూవీ పైరసీని ఆపడం ఎవరి తరం కావడం లేదు. సినిమాలను దొంగతనంగా వీడియో షూట్ చేసి.. ఆ థియేటర్ ప్రింట్ లను వెబ్ సైట్లలోకి ఎక్కిస్తున్నారు సైట్ల నిర్వాహకులు. లేదా… కొత్త సినిమాల రిలీజ్ కాపీరైట్స్ దక్కించుకున్న ఆన్ లైన్ స్ట్రీమింగ్ సైట్లనుంచి HD ఫైల్స్ ను డౌన్ లోడ్ చేసి.. HD, FULL HD, 4Kరెజల్యూషన్లలో అప్ లోడ్ చేస్తుంటారు. ఇలా చేయడం నేరం. సైబర్ పోలీస్ టీమ్స్ ఎంత జాగ్రత్తపడినా… ఆ సైట్లను బ్యాన్ చేయలేకపోతున్నారు. బ్యాన్ చేసినా.. ఆ సైట్లు మరో వెబ్ సైట్ రూపంలో పైరసీ వీడియోలను  అప్ లోడ్ చేస్తూనే ఉన్నాయి.

అంత కష్టపడి.. కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీస్తున్న నిర్మాతలను నిండా ముంచి.. ఆ సినిమాలను ఆన్ లైన్ లో పెట్టడం వల్ల .. ఈ దొంగ సైట్లకు వచ్చే లాభం ఏంటి.. వాటికి డబ్బులు ఎలా వస్తాయి… ఎంత డబ్బు వస్తుంది అనేది చాలా ఆసక్తిరేపే విషయం.

పైరసీ మూవీలకు పాపులర్ అయ్యాయి TamilRockers, MovieRulez వెబ్ సైట్లు. ఇండియాలో ఉంటే దొరికిపోతారనే ఉద్దేశంతో… వీటిని బేసికల్ గా ఫారిన్ కంట్రీస్ నుంచి నిర్వహిస్తుంటారు. ఏ కంట్రీస్ లో అయితే.. ఎటువంటి పైరసీ వీడియో లింక్ లు పెట్టినా నేరం కాదో.. అలాంటి దేశాలనుంచి వీడియోలను అప్ లోడ్ చేస్తారు. ఆ లింక్ లను తీసుకొచ్చి.. ఈ వెబ్ సైట్లలో పెడతారు. ఈ సైట్లకు అప్పటికే పలు కంపెనీల యాడ్ సెన్స్ అప్రూవ్ అయి ఉండటంతో.. బొచ్చెడు యాడ్స్ డిస్ ప్లే అవుతుంటాయి. యాడ్స్ కారణంగా డబ్బులు వస్తాయి. ఏ లింక్ ఓపెన్ చేసినా.. రెండు మూడు యాడ్లు ఓపెన్ అవుతుంటాయి. మోస్ట్ డిమాండెడ్ వెబ్ సైట్లు కావడంతో.. పెయిడ్ యాడ్స్ కూడా వస్తాయి. వాటికి కూడా భారీగా డబ్బులు వసూలు చేస్తుంటారు ఈ పైరసీ సైట్ ఓనర్స్.

కొత్త మూవీ అనగానే ఎగబడే కోట్లమంది ఉంటారు కాబట్టి.. ఈ పైరసీ వెబ్ సైట్లకు క్లిక్స్ తో లెక్కకు మించిన డబ్బు వస్తుంటుంది. దీనిని ఏ కంపెనీ ఆపలేదు. పోలీసులు ఆయా దేశాల్లో కేసులు పెట్టి.. వెబ్ సైట్ లింకులు బ్లాక్ చేసినా.. చివర్లో ఏదో తోక తగిలించి.. కొత్త సైట్ లలో అప్ లోడ్ చేస్తూనే ఉంటారు. ఈ ఆన్ లైన్ పైరసీని ఆపడం ఎవరితరం కావడం లేదు కాబట్టే.. కొన్ని వెబ్ సైట్లు, పైరసీ చేసేవాళ్లు విచ్చలవిడిగా రెచ్చిపోతుంటారు.

పైరసీ చూడటం నైతికంగా తప్పు అని మనకు మనం అనుకుని దూరంగా ఉన్నప్పుడు మాత్రమే.. ఆ సైట్లకు నిర్వహణ భారం పెరిగిపోయి , లాస్ కారణంగా పైరసీ వీడియోలు అప్ లోడ్ చేయడం మానేస్తారు. కానీ..ఇది సాధ్యమేనా. చాలా కష్టం.

(Visited 375 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *