1970, 80లలో
అతడి గొంతులో
తీయదనం ఎక్కువ.
చిరు నవ్వుల తొలకరిలో,
సరిగమలు గలగలలూ పాటల్లోలా,
అలాగే తరంగిణీ ఓ..
ఇదే ఇదే జీవితం వంటివి
మనసును బరువెక్కిస్తాయి.
తొంభైలలో ఆ భావతీవ్రత తగ్గింది. కానీ శ్రావ్యత ఉంది.
నా పాట పంచామృతం, సంగీతమే సరస
లాంటివి ఒకసారి విని చూడండి.) రహమాన్
హరిహరన్, ఉన్నికృష్ణన్
లాంటి వాళ్లతో మెలోడీని అందించాడు.
టూకే తరువాత
కీచుదనం పెరిగింది.
రిపీటెడ్ గా విన బుద్ధేయవు.
కాకపోతే తీయని
కీరవాణి ట్యూన్లు,
భక్తిరసం అతడిని
అన్నమయ్య, రామదాసు అతడి ఇమేజ్ ను నిలబెట్టాయి..
జేసుదాసు గొంతులోని
స్థిరత్వం ఇతడి గొంతులో
లేదు. (ఇది నా వ్యక్తిగత
అభిప్రాయం మాత్రమే.)
ఈటీవీ స్వరాభిషేకంలో “తనివి తీరలేదే” పాట కల్పనతో కలిసి పాడినప్పుడు
ఆమెది పూర్తిగా పై చేయి
అయ్యింది. వయసు ప్రకృతిని అధిగమించడం
ఎవరికైనా అసాధ్యమే.
కాని ఐదు దశాబ్దాల
ఒకే రకమైన ఆదరణ లేదు. తొంభైలలో వర్తమాన గాయకులు గట్టిపోటీనిచ్చారు.
ఇతడి భగవద్గీత అట్టర్ ప్లాప్. కాని ఇంత దీర్ఘకాల కెరీర్ ,సక్సెస్ ఇంకెవరిలోనూ
చూడలేం.
యాభయ్యేళ్లలో సింగర్ గా బాలు హిట్టా.. ఫ్లాపా..?
