లాక్ డౌన్ లో హలీమ్ అమ్మకాలు.. ముగ్గురిపై కేసు నమోదు

Haleem Sales in Hyderabad in Lock down time
Spread the love

రంజాన్ మాసం.. హలీమ్ కు స్పెషల్. ముస్లింలు పవిత్రంగా భావించి ఉపవాసాలు ఉంటారు. ఐతే.. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న టైమ్ లో ఈసారి రంజాన్ సీజన్ వచ్చింది. ముస్లింలు ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని.. ప్రభుత్వం అమలుచేస్తున్న లాక్ డౌన్ పాటించాలని ముస్లిం పెద్దలు ఇప్పటికే చెప్పారు. ఐతే.. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో పరిస్థితి భిన్నంగా ఉంది.

తాగడానికి చాయ్.. తినడానికి ఏదైనా టిఫిన్ అస్సలే దొరకని ఈ టైమ్ లోనూ… హైదరాబాద్ బంజారాహిల్స్ లో రంజాన్ స్పెషల్స్ ను రోడ్డుపైనే యథేచ్చగా అమ్ముతున్నారు. హలీమ్, దహీ వడ, లాంటి.. రంజాన్ స్పెషల్ వంటకాలను జోరుగా రోడ్డుపైనే టేబుల్స్ పెట్టి అమ్ముతున్నారు కొందరు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని జహిరా నగర్ చౌరస్తాలో లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి హలీం విక్రయాలు చేశారు. నాకాబందీలో ఉన్న బంజారాహిల్స్ పోలీసులు ఇది గమనించి.. ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.

రంజాన్ పండుగనాడు హలీమ్ తినాలని అందరికీ ఉంటుంది. కానీ.. కరోనా మహమ్మారి ప్రాణాలు తీసే అంటురోగం. ఎవరిలో వైరస్ ఉంటుందో తెలియదు. ఇమ్యూనిటీ బలంగా ఉండి వైరస్ బయటకు కనిపించనిది కొందరైతే.. లోపల వైరస్ లేని వాళ్లు ఎందరో. ఈ టైమ్ లో బయట అమ్ముతున్న పదార్థాలను తింటే ఇంకేమైనా ఉందా..!! అలాంటి అంటురోగాలు పక్కవారికి ఇలాంటి సందర్భాల్లోనే ఈజీగా అంటుకుంటాయి. వ్యాపారులు ఇది గమనించి బహిరంగ అమ్మకాలు చేయకపోతే సమాజ సేవ చేసినట్టే. ఎవరింట్లో వాళ్లు.. యూట్యూబ్ వీడియోలు చూసుకుంటూ మాంసం కొనుక్కుని హలీమ్ ను ఇంట్లో తయారుచేసుకోవడం ఉత్తమం.

(Visited 72 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *