వీ6 తీన్మార్ నుంచి బయటకొస్తే అంతే సంగతులు.. మాజీ ఉద్యోగి ఆవేదన

v6 teenmar ismart news
Spread the love

రాజీ పడలేని చోట రాజీనామా ఇవ్వాల్సిందే..
ఆత్మ గౌరవాన్ని చంపుకుని సంఘర్షణలకు లోను అవుతు పని చేయవలసిన గత్యంతరం లేదు అనిపించింది. జూన్ 23 న టీవీ9 కు రాజీనామా చేశాను.

ముఖ్యంగా నేను టీవీ9 లో కృతజ్ఞత చెప్పుకునేది ఎవరికైనా ఉంది అంటే నన్ను పిలిచి పెద్ద బాధ్యత అప్పజెప్పిన రవి ప్రకాష్ సర్, క్రాంతి ( ఆందోల్ ఎమ్మెల్యే) సార్లకే. వారితో చాలా దగ్గరగా పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం. వారు ఇచ్చిన ప్రోత్సాహం , దైర్యం , స్ఫూర్తి మరువలేనివి.

ఇక పోతే తెలంగాణ యాస, భాష, సంస్కృతి పై అవగాహన లేనివారు , ఇక్కడి సాంస్కృతిక జీవం తెలియని వారు , రేటింగ్ ల కోసం అరగంట నవ్వించే “బుడ్డర్ ఖాన్ ” తెలంగాణ యాస ప్రోగ్రామ్స్ అనుకుంటున్నారు కొందరు. యాసకు డిమాండ్ ఉందని తప్ప ఇక్కడి భాష పై ప్రేమతో మనస్ఫూర్తిగా చేసేవాళ్ళు కరువైపోయారు.

ఈరోజు అంతట తెలంగాణ ప్రోగ్రామ్స్ టాప్ రేటింగ్స్ లో ఉన్నాయి అంటే దానికి కారణం v6 c.e.o అంకం రవి సారు వేసిన బాటనే. మీడియా లో తెలంగాణ భాషకు బ్రాండ్ ఇమేజ్ తెచ్చిన హీరో అయన అని సగర్వంగా చెబుతాను. వారితో అత్యంత సన్నిహితంగా పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం. ప్రతిభ ఉంది అంటే చాలు ఎవరినైనా గుర్తించి ప్రోత్సహించే ది బెస్ట్ బాస్ అయన. నేను వీ సిక్స్ తీన్మార్ లో రైటర్ కం ప్రొడ్యూసర్ గా చేరినప్పుడు నాలోని ప్రతిభని గుర్తించి 6 నెలల్లో 2 సార్లు జీతం పెంచారు. ఇది చాలు అయిన ట్యాలెంట్ నీ ఎలా ప్రోత్సహిస్తా రో చెప్పడానికి. అయితే కొన్ని కారణాల వల్ల అప్పట్లో నేను విసిక్స్ నీ వదిలి పెట్టీ ఆయన్ను చాలా బాధ పెట్టాను. అందుకు ఆయనకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పుకుంటున్నాను. మిమ్మల్ని చాలా నొప్పించాను సార్. మీరు ఎప్పటికైనా నన్ను మన్నిస్తరని కోరుకుంటున్నాను.

హార్డ్ ట్రూత్ బట్ అంగీకరించ వలసిన విషయం ఎంటి అంటే వీసిక్స్ తీన్మార్ నుంచి ఎవరు బయటకు వచ్చిన వారి పరిస్తితి చెరువు లోంచి బయట పడ్డ చేప పిల్ల పరిస్థితే. అందులోంచి బయటకు వచ్చిన అనేక మంది పరిస్థితి , నాతో సహా చెప్పు కోవడానికి ఎం అంత గ లేదు. ఎందుకంటే ఆయనలా వెన్ను తట్టి , అన్ని రకాలుగా ఒక తండ్రి లాగ ప్రోత్సహించే వ్యక్తులు దొరకడం చాలా అరుదు.

మన భాష ఎన్నో ఏండ్లుగా అవమానాలు ఎదుర్కొంటున్న టైమ్ లో పక్క తెలంగాణ యాసలో తీన్మార్ వార్తలు కార్యక్రమానికి పునాది వేసి తెలంగాణ భాష దమ్మును ప్రపంచానికి పరిచయం చేసిన దమ్మున్న వ్యక్తి అయన. అంకం రవి సారులాగ తెలంగాణ జీవన సంస్కృతిని ప్రేమించి , తెలంగానియత ను ప్రతి బింబించే కార్యక్రమాలు రూపొందించిన వ్యక్తులు చాలా తక్కువగా కనిపిస్తారు. కొన్నాళ్ళు v6 లో పనిచేసి, ఎమ్మెల్యే అయ్యేంత వరకు టీవీ1 ( జై తెలంగాణ టీవీ) హెడ్ గ ఉన్న క్రాంతి సారు కూడా టీవీ 1 లో తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి దోహద పడే అనేక కార్యక్రమాలు కు రూపకల్పన చేశారు. వారు వెళ్ళాక కొద్ది రోజులకే తదనంతర పరిణామాల వల్ల టీవీ వన్ మూతపడ్డది. అది వేరే విషయం. ఈ మద్యలో “ప్రజాస్వామ్య పరిరక్షకులు,” రియల్ ఎస్టేట్ కు వెన్నుదన్నుగా ” ఫోర్త్ ఎస్టేట్ వ్యాపారం” లోకి దిగిన లోకోద్దరకులు రేటింగు ల కోసం హడావిడిగా యాస లో కార్యక్రమాలు మొదలు పెట్టారు. హరి కథ ఎంత బాగా చెప్పిన పళ్ళెం లా పావుల నే ఎస్తరు అన్నట్టు ఆదరణ కూడా అలాగే వచ్చింది. దాన్ని నిలుపుకోవడానికి ఎన్నెన్నో తైతక్కలు ఆడల్సి వస్తుంది.

అందుకే ఇక్కడి యాస, భాష, సాంస్కృతి గాఢత తెలుసుకుని, గుండె లోతుల్లోంచి నిజంగా ప్రేమించే వారే కార్యక్రమాలు చేస్తే బాగుంటది. లేదంటే తెలంగాణ సమాజం విశ్వాసం చూరగొన్న ఒక ప్రముఖ ఛానెల్ హైదరాబాద్ మార్కెట్ లో రేటింగులు పరంగా పంటి కింద రాయిలా తగులు తుంది అనో, దానికి చెక్ పెట్టాలని ” అందులో పనిచేసే వారిని డబ్బుతో కోనుక్క ” వస్తేనో జనం ఒన్ చేసుకోరు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్న ట్టే అవుతుంది. తెలంగాన సమాజం పై ఎనలేని ప్రేమ ఉన్నట్టుగా యాస ముసుగు తొడిగి వస్తున్న ఉసరవెళ్లులను నమ్మెంత గుడ్డిది కాదు తెలంగాణ. –Kumar 

(Visited 133 times, 1 visits today)
Author: kekanews