జిహాద్-సజ్జనార్-అసద్ ట్వీట్లు… ‘ఈనాడు’ తప్పుగా అర్థం చేసుకుంది…!

sajjanar asad jihad
Spread the love

హైదరాబాద్ లో అమెరికా సంస్థలు, కాన్సులేట్ ను ఉగ్రవాదులు టార్గెట్ చేశారంటూ కొందరు సోషల్ మీడియాలో పెట్టిన వార్తకు సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో వైరల్ అయింది. సురేష్ కొచ్చాటిల్ అనే వ్యక్తి సైబరాబాద్ పోలీస్, హైదరాబాద్ పోలీస్, రాచకొండ సీపీలను ట్యాగ్ చేసి  ట్వీట్ చేశారు. అమెరికాపై ఇరాన్ దాడుల నేపథ్యంలో.. హైదరాబాద్ లోని అమెరికా సాఫ్ట్ వేర్ సంస్థలు, కాన్సులేట్ ను సిటీలోని కొందరు(జిహాదీలు అని మెన్షన్ చేశారు) టార్గెట్ చేసి ఉంటారని.. అలర్ట్ గా ఉన్నారా లేదా అని ఆయన ప్రశ్నించారు. తనిఖీలు చేసి.. సెక్యూరిటీని టైట్ చేయాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు.

దీనిపై సీపీ “ఎస్ సర్.. మా దగ్గర ప్రత్యేకమైన బృందాలు ఉగ్రవాద సమాచారం, కదలికలపై పనిచేస్తున్నాయి. ఇంకేమైనా సమాచారం ఉంటే చెప్పండి” అని స్పందించారు.

సీపీ సజ్జనార్ చేసిన ఈ రిప్లైపై హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఔనని అంటున్న సీపీ.. హైదరాబాద్ సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఎంతమంది జిహాదీలు పనిచేస్తున్నారో లెక్క చెప్పాలని అన్నారు. భక్తులకే రిప్లై ఇస్తారా.. ఓ ఎంపీకి కూడా  ఇస్తారా అని అన్నారు. తన రిప్లైని తప్పుగా అర్థం చేసుకున్నారని.. ఉగ్రవాద కదలికలపై తాము అలర్ట్ గా ఉన్నామని మాత్రమే చెప్పానని సీపీ సాయంత్రం మరో రిప్లై ఇచ్చారు.

ఈ వార్తను ఈనాడు దినపత్రికలో పొరపాట్లతో ప్రచురించారు. నిజానికి… ఎంపీకి, సీపీకి మధ్య చర్చే జరగలేదు. జిహాదీల పోస్టును సీపీ సజ్జనార్ కు.. ఎంపీ అసద్ ట్యాగ్ చేయలేదు. సజ్జనార్ ఎంపీకి రిప్లై ఇవ్వలేదు. ఓ సిటిజన్ కు ఇచ్చారు. ఈ రిప్లైని మాత్రమే సీపీకి ట్యాగ్ చేసి… అసద్ వివరణ కోరారు. ఈనాడులో వచ్చిన వార్త, ట్వీట్ల వివరాలు కింద చూడొచ్చు. ఈనాడు స్టాండర్డ్స్ ఓ స్థాయిలో ఉండవు. కానీ.. ఎంతటివారికైనా పొరపాట్లు సహజం.

 

(Visited 145 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *