మూవీ రివ్యూ : డర్టీ హరి

http://www.kekanews.com/

Movie Review : Dirty Hari

డిసెంబర్ 19న ఆహా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ మూవీని.. లేటెస్ట్ గా.. జనవరి 8న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా కేక పాఠకుల కోసం కెవ్వుమనిపించే రివ్యూ.

బాలీవుడ్ లో మల్లికా షెరావత్, ఇమ్రాన్ హష్మీ కాంబినేషన్ లో వచ్చిన మర్డర్ 2004లో సృష్టించిన సంచలనం ఎవరూ మరిచిపోలేనిది. లవ్ , లస్ట్, రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన ఆ మూవీని.. ఇప్పటికీ వీరాభిమానులు ఉన్నారు.

తెలుగులోనూ.. అలాంటి బోల్డ్ సబ్జెక్ట్ తో.. వచ్చిన సినిమాలు యూత్ ను బాగా కనెక్ట్ చేశాయి.

మొన్న అర్జున్ రెడ్డి… నిన్న ఆర్ ఎక్స్ 100.. ఈ లైన్ లో చెప్పుకోవాల్సిన తాజా సినిమానే డర్టీ హరి.

అడల్ట్ కంటెంట్ ఉన్నంతమాత్రాన ఏ సినిమా అయినా  హిట్టనిపించుకోదు. అలా అయితే.. ప్రతి బూతు సినిమాకు జనం ఎగబడాలి. కానీ.. అలా జరగడం లేదు. అడల్ట్ కంటెంట్ ఉన్నా.. అందులో ఎమోషన్ ఉండాలి. ఎమోషనల్, రొమాంటిక్, లవ్, లస్ట్, క్రైమ్, థ్రిల్లర్ ఇలా.. అన్ని అంశాలు కలిస్తే… ఆ సినిమాలో బిగి సడలని స్క్రీన్ ప్లే ఉంటే.. కథ కుదిరితే.. హిట్టు కాకుండా ఉంటుందా.

డర్టీ హరి. మామూలుగా అయితే ఇతడు కూడా అందరిలాంటి కుర్రాడే. కాకపోతే చాలా లక్కీ ఫెలో. కానీ.. పరిస్థితులు అతడిని డర్టీగా మార్చేస్తాయి.

హోర్డింగ్ పై కనిపించే అందమైన మోడల్ తో యువకులు కలలు కనడం సహజం. కానీ.. అదే అమ్మాయిని కలిసే అవకాశం వస్తే.. అనుభవించేందుకు అవకాశాలున్నాయని తెలిస్తే.. ఊరుకుంటారా.. డర్టీ హరిది కూడా అదే పరిస్థితి.

డబ్బున్న అమ్మాయి మనసు పడి పెళ్లిచేసుకోవడంతో.. హరి దశ మారుతుంది. తన బామ్మర్ది పెళ్లిచేసుకోబోయే అమ్మాయే ఆ అందమైన మోడల్ జాస్మిన్ అయినప్పుడు… ఆమెను ఎలాగైనా వశపరుచుకోవాలని ఆశ పడిన హరి.. మొదటగా డర్టీ అనిపించుకుంటాడు.

పెళ్లి మాట అనుకుంటున్నప్పుడు.. కాబోయే అత్త ప్రవర్తన నచ్చక.. హరితో హీరోయిన్ జాస్మిన్… సజ్జ చేనులో రొమాన్స్ లోకి దిగిపోతుంది. ఈ సీన్ ను.. ఇంతవరకు ఏ సినిమాలోనూ చూసి ఉండరు. అక్కడ హీరోయిన్ డైలాగులు.. అవకాశం కోసం చూస్తున్న హీరో అల్లుకుపోవడం… ఒక రేంజ్ అది.

మోడల్ జాస్మిన్ కు.. హీరోయిన్ అవ్వాలనేది కల. లైఫ్ లో చాలా ప్రాక్టికల్ గా ఉంటుందామె. ఏదో మూడ్ లో తప్పు జరిగినా.. దాన్ని కంటిన్యూ చేయాలనుకోదు. కానీ.. హరి పదే పదే ప్రేరేపిస్తాడు. ఇది కరెక్ట్ కాదని.. హీరోయిన్ చెబుతున్నా.. హరి ఆమెను లొంగదీసుకుంటాడు. ఇది వారిద్దరి మధ్య అటాచ్ మెంట్ పెంచుతుంది. అలా.. ఒళ్లు ట్రాన్స్ ఫార్మర్ లా హీటెక్కిపోయే సీన్లు.. 2,3 వచ్చాక.. కథలో ట్విస్ట్ వస్తుంది.

పెళ్లిచేసుకున్న భార్యతో మెకానికల్ గా సెక్స్ లైఫ్ అనుభవిస్తున్నాననీ…. ప్రియురాలు జాస్మిన్ తో నిజమైన ప్రేమను దక్కించుకుంటున్నానని హరి అంటాడు. అలా.. సాగుతున్న వారిద్దరి ఇల్లీగల్ ఎఫైర్.. ఎక్కడదాకా వెళ్లింది.. హరి జాస్మిన్ ను పెళ్లిచేసుకున్నాడా.. భార్య వసుధ పరిస్థితి ఏంటి…  డబ్బు కోసం భార్య కావాలి.. మనసు పడ్డ అమ్మాయి పంచన ఉండాలి అని డర్టీగా ఆలోచించే హరి పరిస్థితి చివరికి ఏమైంది.. అనేది.. సినిమాలో చూడాల్సిందే.

డర్టీ హరిలో శృంగార సన్నివేశాల మోతాదు చూసే జనాలకు మాంచి కిక్ ఇస్తుంది. ఇప్పటివరకు ఏ సినిమాలో చూడనంత కామం ఈ సినిమాలో నింపాడు దర్శకుడు ఎంఎస్ రాజు. ఐతే.. అవే సన్నివేశాలు.. సినిమాలోని గాఢతను పెంచాయి. హీరో, హీరోయిన్ల మైండ్ సెట్ ను బాగా ఎలివేట్ చేశాయి. ఎదురుదెబ్బలు తిన్నప్పుడు క్యారెక్టర్లు తిరగబడినప్పుడు కూడా.. మంచి ట్విస్ట్ ఫీల్ వస్తుంది. చివర్లో వచ్చే వరుస.. మలుపులు కూడా ఆకట్టుకుంటాయి.

సన్నీని మించిన కిక్ ఇచ్చిన సిమ్రత్ కౌర్

శ్రవణ్ రెడ్డి… బాగా నటించాడు. సెక్స్ సీన్స్ లో రెచ్చిపోయాడు. హీరోయిన్ సిమ్రత్ కౌర్ దే అసలైన లీడ్ రోల్. ఆమె నటన.. డేర్ వల్లే మూవీ బాగా పండింది. సన్నీలియోన్ సినిమాలు చూసినా.. రాని కిక్కు సిమ్రత్ కౌర్ ను ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ ను చూస్తే కలుగుతుందంటే ఆమె ఎంతబాగా జీవించిందో అర్థం చేసుకోవచ్చు. ఎమోషనల్ సీన్స్ లోనూ అంతే బాగా నటించింది సిమ్రత్ కౌర్. హీరో భార్య పాత్రలో.. రుహానీ శర్మ కూడా తన పరిధిమేరకు ఆకట్టుకుంటుంది.

మూవీ కొద్దిరోజులు ఆడిపోతుండొచ్చు. కానీ.. Lets Make Love అనే పాటమాత్రం .. ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అది విజువల్ గా అయినా… లిరికల్ గా అయినా… మ్యూజికల్ గా అయినా.

పాత్రలన్నీ కొత్తవే. కానీ.. పరిచయం అయిన కొద్ది నిమిషాలకే అన్నీ కనెక్ట్ అయిపోతాయి. దీంతో.. మిగతా సినిమా అంతా.. అలా స్పీడ్ గా సాగిపోతుంది. డర్టీ హరి మూవీని.. ఓసారి తప్పకుండా చూడండి. అడల్ట్ కంటెట్ మోతాదు బీభత్సంగా ఉన్నా.. మూవీలో మంచి మెసేజ్ ఉంది. పెళ్లి తర్వాత ఇల్లీగల్ ఎఫైర్స్ తో కచ్చితంగా కొంపలు కూలుతాయని.. జీవితంలో సుఖం లేకుండాపోతుందన్న సంగతి మరువరాదని ఈ మూవీ తేల్చేస్తుంది.

కేక రేటింగ్ : A.. స్ట్రిక్ట్ లీ ఫర్ అడల్ట్స్… 3.5/5

(Visited 168 times, 1 visits today)