పెళ్లికి రెడీ అయిన సాహో డైరెక్టర్ సుజీత్

sujeeth Prabhas
Spread the love

యంగ్ ఏజ్ లోనే ప్రభాస్ తో సాహో లాంటి పాన్ ఇండియా సినిమా తీసి ప్రశంసలతోపాటు విమర్శలు అందుకున్న నేషనల్ ఫిగర్ గా మారిన డైరెక్టర్ సుజీత్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ప్రవళ్లిక అనే డాక్టర్, రైటర్ తో కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నాడు సుజీత్. ఇపుడు పెళ్లి పీటలెక్కేందుకు ఈ జంట సిద్ధమైపోయింది. నిఖిల్ – నితిన్ – రానా తర్వాత… మరో సెలబ్రిటీ.. లాక్ డౌన్ టైమ్ లో ఓ ఇంటివాడు కాబోతున్నాడు.

హైదరాబాద్ గోల్కొండ రిసార్ట్స్ లో జూన్ పదో తేదీన నిశ్చయ తాంబూలాల కార్యక్రమం ఏర్పాటుచేసినట్టు సన్నిహితులు చెప్పారు. పెళ్లి డేట్ ను ఇదేరోజు ఫిక్స్ చేస్తారట. లాక్ డౌన్ ఉండటంతో… రిసార్ట్స్ కు కేవలం యాభై మంది సన్నిహితులైన కుటుంబసభ్యులను మాత్రమే ఆహ్వానిస్తున్నారు. రెండు కుటుంబాలకు చెందినవారు ఉంటారు.

సుజీత్ కు ఆకాశమంత ఇమేజ్ అందించిన ప్రభాస్ అతడి నిశ్చితార్థానికి వస్తాడా అన్నది ఆసక్తిగా మారింది. ప్రభాస్ కనిపిస్తే… ఆ ఫొటోలు వైరల్ కావడం ఖాయం.

(Visited 141 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *