కొత్త ఏడాది వచ్చిందంటే క్యాలెండర్ ఫొటో షూట్లు కామన్. అన్ని ఇండస్ట్రీస్ లోనూ ఫేమస్ ఫొటోగ్రాఫర్లు.. తమ స్టైల్ ను చూపిస్తుంటారు. బాలీవుడ్ లో దబూరత్నానీ సెలబ్రిటీ స్టార్స్ ఫొటోలు తీయడంలో దిట్ట. హీరోయిన్ల గ్లామర్ ను దబూ కెమెరా బాగా పసిగడుతుందని చెప్పుకుంటుంటారు. DabooRatnani కెమెరా కంటినుంచి తమ అందాలు, మేని ఒంపులను, సిక్స్ ప్యాక్ బాడీలను, స్టైల్ ను ఎక్స్ పోజ్ చేయించుకోవడానికి బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా తెగ ఆరాటపడుతుంటారు. అలా.. ఈసారి కూడా 2020 దబూరత్నానీ క్యాలెండర్ ఫొటో షూట్ అట్టహాసంగా రిలీజ్ అయింది.
బాలీవుడ్ లో తన 25 ఏళ్ల సర్వీస్ ను ఈసారి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు దబూ రత్నానీ. ఎప్పటిలాగే ఈసారి కూడా సెలబ్రిటీలతో ఫొటోషూట్ చేశాడు దబూరత్నానీ. ఒక్కొక్కరిగా.. వాళ్ల స్టైలింగ్ ఎలా ఉందో చూద్దాం.
1.కియారా అద్వానీ.
హాట్ లుక్స్ తో ఈసారి అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది కియారా అద్వానీ. క్యాలెండర్ లోని ఓ లీఫ్ ను నేను అంటూ.. ఆమె తన ఫొటోను రివీల్ చేసింది. ఆకు చాటు అందాలతో అందరి మతులు పోగొడుతోంది కియారా అద్వానీ.