కరోనా తడాఖా.. కోటి దాటిన కేసులు

corona cases crosses 1 crore mark across world wide
Spread the love

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు కోటి దాటాయి. తొలి కరోనా కేసు నవంబర్ 17న చైనాలోని వుహాన్ నగరంలో ట్రేస్ అయింది. వుహాన్ లో డిసెంబర్ లో తొలి కరోనా మరణాన్ని గుర్తించారు. ఆ తర్వాత.. ఇది ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూ పోయింది. తాజాగా… జూన్ 27.. 2020న ప్రపంచవ్యాప్త కరోనా కేసుల సంఖ్య కోటి దాటింది. అంటే.. వైరస్ పుట్టన దాదాపు ఏడు నెలల్లో  ప్రపంచవ్యాప్తంగా కోటిమంది ప్రజలకు కరోనా సోకింది.

చైనా నుంచి.. థాయిలాండ్ కు… థాయిలాండ్ నుంచి మలేషియాకు.. ఇలా…. ఒక్కో దేశానికి విమాన ప్రయాణికుల ద్వారా… SARS-CoV2( సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ –కరోనా వైరస్ 2) వైరస్ విస్తరించింది. ప్రస్తుతం మొత్తం 215 దేశాల్లో కరోనా వైరస్ వ్యాపించింది.

వైరస్ గుర్తించిన చైనా… యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంది. అప్పటికే ఇలాంటి దరిద్రపు గొట్టు వైరస్ లను ఎన్నో గుర్తించిన చైనా.. ఈ కరోనా వైరస్ ను కూడా తొందరగానే తమ దేశంలో కంట్రోల్ చేసింది. ఐతే.. ఇలాంటి వైరస్ లను డీల్ చేయడంలో.. మిగతా దేశాలు తడబడుతున్నాయి. వైరస్ బాధితుల సంఖ్య.. కొద్దిరోజుల్లోనే ప్రపంచ దేశాల్లో భారీగా నమోదైంది. చైనాను పెద్దపెద్ద దేశాలన్నీ దాటేశాయి. మొదట్లో అత్యధిక కేసులు, మరణాలతో ఇటలీ ప్రపంచాన్ని భయపెట్టింది. ఆతర్వాత.. చావులను కంట్రోల్ చేసింది. ఐతే.. అమెరికాలో వైరస్ ఎక్కువగా వ్యాపించింది. ఆ దేశంలోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి.

ఇపుడు 215 దేశాల్లో మొత్తంగా కరోనా బాధితుల సంఖ్య కోటి దాటింది. ఇందులో పావువంతు కేసులు అమెరికాలోనే నమోదయ్యాయి. జూన్ 27 నాటికి.. అమెరికాలో 25లక్షల కేసులు.. బ్రెజిల్ లో 12లక్షల కేసులు, రష్యాలో 6లక్షల కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత నాలుగో స్థానంలో మన ఇండియానే ఉంది. ఇండియాలో ఇప్పటివరకు 5లక్షల 29వేలకు పైగా కరోనా బాధితులు ఉన్నారు.

యూకేలో 3.1లక్షలు… స్పెయిన్ లో 2.95లక్షలు.. పెరులో 2.72 లక్షలు.. చిలీలో 2.67లక్షల కేసులు నమోదయ్యాయి.

ఐతే.. కరోనాతో ప్రాణనష్టం అమెరికాలో భారీస్థాయిలో ఉంది. అమెరికాలో లక్ష 27వేలమందికి పైగా చనిపోయారు. బ్రెజిల్ లో 56వేల మంది.. యూకేలో 43వేల మంది.. ఇటలీలో 34వేల మంది, ఫ్రాన్స్ లో 29వేల మంది.. స్పెయిన్ లో  28వేల మంది.. మెక్సికోలో 25వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇండియాలో 16వేలకు పైగా జనం ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ దేశాల్లో వైరస్ డామేజ్ తో పోల్చితే.. ఇండియా ఇప్పటికీ సేఫ్ గానే ఉన్నట్టుగా భావించాలని నిపుణులు చెబుతున్నారు.

ఇండియాలో ఇప్పటికి 5.29లక్షల కేసులే ఉన్నా… గుర్తించని కేసులు కోటి వరకు ఉండొచ్చని ప్రపంచ దేశాల ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఐతే.. అత్యధిక జనాభా ఉన్న ఇండియాలో కరోనా జులై, ఆగస్ట్ నెలల్లో  పీక్స్ కు చేరుకుంటుందని చెబుతున్నారు. అప్పటికి కేసుల్లో అమెరికాను ఇండియా దాటిపోతుందని అంటున్నారు. ఐతే.. వైరస్ విస్తరిస్తున్న మొదట్లో.. ఇండియాలో కోటి మంది చనిపోతారన్న వార్త ప్రచారంలోకి రావడంతో… జనం భయంతో కంపించిపోయారు. ఐతే.. వైరస్ ప్రభావం ఇండియాలో తక్కువగా ఉందని అధ్యయనాల్లో తేలుతుండటంతో.. భారతీయులు కాస్త ఊపిరితీస్కుంటున్నారు. కరోనా వచ్చినా.. ఎక్కువ సంఖ్యలో ప్రజలు కోలుకుంటున్నారు. కోటి కాదు.. 2, 3 కోట్లు అయినా.. వైరస్ ను జాగ్రత్తలతో కోలుకోవచ్చనీ… ప్రాణనష్టం ఉండదన్న భరోసా భారతీయల్లో వ్యక్తమవుతోంది.

(Visited 81 times, 1 visits today)
Author: kekanews