యువ ఎంపీ షాక్స్… జగన్ రాక్స్… క్లాస్ అదిరింది..! పార్టీ వణికింది!!

Spread the love

ఎవరైనా తప్పు చేస్తే ఎపీ సీఎం జగన్ ఏం చేస్తాడో…
ఈ వీడియో చూస్తే కన్మర్మ్ గా తెలిసిపోతుంది..

ఏపీ సీఎం జగన్ కు ఓ క్లారిటీ ఉంది..ఓ విజన్ ఉంది.. తాను సీఎంగా వందకు వంద మార్కులు సంపాదించాలనే కృతనిశ్చయం ఉంది.. అందుకే ప్రజా సంక్షేమ పథకాల అమలులో ఆర్థిక భారాన్ని ఏమాత్రం లెక్క చేయడం లేదు..అలాగే తన ప్రభుత్వంలో ఏమాత్రం అవినీతి ఉన్నా సహించడం లేదు.. ఆరోపణలు వస్తే చాలు వాళ్లు తనవాళ్లే అయినా.. అధికారులైనా..మంత్రులైనా..ఎంతటి ఉన్నతులైనా.. వారికి మూఢినట్లే.. నిన్నమొన్న జరిగిన ఓ ఇష్యూతో సొంత పార్టీ నేతలు..అధికారులు కంగు తిన్నట్లు తెలుస్తోంది.. రాజమండ్రి యువ ఎంపీ..పార్లమెంటరీ పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్ విషయంలో జగన్ అనుసరించిన వైఖరితో ఎక్కడి దొంగలు అక్కడే సర్దుకుంటున్నారట..
ఇంతకీ ఏం జరిగిందయ్యా అంటే.. సదరు వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ ఓ కుంభకోణంలో చిక్కుకున్నారు..దాని విలువ దాదాపు వంద కోట్లు.. పేదలకు భూములు పంచాలని జగన్ భూసేకరణ చేయమని ఆదేశాలిచ్చారు.. దాంతో గోదావరి నది వరద ముంపు ప్రాంతంలోని ఆవా భూముల సేకరించే క్రమంలో భారీ కుంభకోణం చోటు చేసుకున్నట్లు ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు గుప్పించాయి.. దీనిపై విచారణకు ఆదేశించిన సీఎంకు షాకింగ్ విషయాలు తెలిసినట్లు సమాచారం.. ఇందులో స్థానిక ఎంపీ భరత్ హస్తం ఉన్నట్లు సాక్ష్యాధారాలు, కాల్ రికార్డ్స్ దొరకడంతో భరత్ కు వణుకుపుట్టించే రేంజిలో క్లాస్ పీకినట్లు సమాచారం.. అంతేకాదు ఇంకోసారి ఏదైనా ఇష్యూలో తలదూర్చినట్లు తెలిస్తే ఉపేక్షించబోయేది లేదని కూడా స్పష్టం చేశారట..అంతేకాదు గదిలోకి తీసుకెళ్లి ఇవేం పనులు అంటూ చెంపమీద కొట్టినట్లు కూడా కొందరు చెబుతున్నారు.. బిత్తరపోయిన భరత్ సారీ..ఇంకోసారి చేయనంటూ వేడుకున్నట్లు..కాళ్లబేరానికి వచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం.. జగన్ మాత్రం భరత్ ను క్షమించబోవడం లేదని తెలుస్తోంది.. వచ్చే శీతాకాల సమావేశాల నాటికి తనను పార్టీ చీఫ్ విప్ పదవి నుంచి తొలగించబోతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.. నిజానికి భరత్ అంటే జగన్ కు చాలా ఇష్టం..యువకుడు..అందునా మొదటి సారి ఎంపీ కావడంతో అతనికి ఎంతో భవిష్యత్తు ఉంటుంది అనే ఉద్దేశ్యంతో ఏకంగా చీఫ్ విప్ పదవిని కట్టబెట్టారు..అలాంటిది భరత్ ఇలాంటి విషయాల్లో ఇరుక్కోవడంతో జగన్ మనస్థాపం చెందినట్లు చెబుతున్నారు.. అంతేకాదు..తనను ఉపేక్షిస్తే పార్టీలో ఇలాంటివి మళ్లీ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా కఠినంగా ఉండాలని.. తప్పు చేస్తే శిక్షలు తీవ్రంగా ఉంటాయనే విషయం తెలియజెప్పాలని జగన్ అనుకుంటున్నారట.. అందుకే తన సొంత ఎంపీ అయినా..పార్టీ పరువు పోతుందని తెలిసినా జగన్ పట్టించుకోలేదని చెబుతున్నారు.. ప్రతిపక్షాలు మరోసారి వేలెత్తి చూపించే పరిస్థితి రాకూడదనేదే జగన్ ఆలోచన అట.. ఆరోపణలు వస్తే ఎంపీ పరిస్థితే ఇలా ఉంటే ఇక తమ పరిస్థితి ఏంటో అని పార్టీలో, ప్రభుత్వంలో గుసగుసలు మొదలయ్యాయి.. అయితే జగన్ నవరత్నాలు..ఇతర పథకాలర అమలులో ఎలాంటి అవినీతి చోటుచేసుకోకుండా ఉండాలి అంటే ఇలాంటి కఠిన చర్యలు తప్పవని భావిస్తున్నారట.. ఎంపీ షాక్స్..జగన్ రాక్స్.. క్యా బాత్ హై..

(Visited 98 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *