ఏయ్ నిన్నే… ఈ లిస్ట్ లో నువ్వెక్కడున్నావో తెలుసుకో.. సరి చేసుకో.. Must Read

Spread the love

*పాపమయ్యేలా*
*సంపాదించకండి*

*అప్పు అయ్యేలా*
*ఖర్చుచేయకండి*

*అజీర్తి అయ్యేలా*
*తినకండి*

*మనస్పర్ధలొచ్చేలా*
*మాట్లాడకండి*

*ఆలస్యమయ్యేలా*
*నడవకండి*

*చితికి చేరేలా*
*చింతించకండి*

*ఆలస్యం చేస్తూ*
*కాలాన్ని నిందించకండి*

*అర్థం చేసుకోకుండా*
*అవమానపర్చకండి*

*నాదే లోకం అనుకోకుండా*
*ప్రపంచాన్ని చూడండి*

*ద్వేషాన్ని వదిలేసి*
*ప్రేమను ఆహ్వానించండి*

*ఇతరులు తక్కువ అనకుండా*
*మనమే తక్కువ చేసుకోండి*

*కోపంగా 10 మాటలు కాదు*
*ప్రేమగా ఒక్క మాట చాలు*

*ముందు ఎంతున్నది కాదు*
*వెనక ఎంత ఖ్యాతి ఉందో తెలియాలి*

*ఎంత సీనియారిటి అన్నది కాదు*
*ఎంత సిన్సియారిటి అన్నది ముఖ్యం*

*ఎంత ఎత్తుకు ఎదిగామన్నది కాదు*
*ఎన్ని లోతులు తెలిసాయన్నది ముఖ్యం*

*ఏమి సాధించామన్నది కాదు*
*ఏమి కోల్పోలేదన్నది ముఖ్యం*

*ఎంత మంది స్నేహితులన్నది కాదు*
*ఒక్క శత్రువు లేరన్నది ముఖ్యం*

(Visited 207 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *