Posted inTrending / కేక స్టోరీ / పొలి కేక / ఫ్రెష్ కేక / వైరల్

జగన్‌కు దిమ్మతిరిగే షాక్.. వైఎస్ఆర్ జిల్లా పేరు మళ్లీ కడపగా మార్పు?

ysr kadapa district satya kumar

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ (YS Jagan Mohan Reddy) కు షాక్ మీద షాకిస్తోంది కూటమి సర్కార్. శ్రీవారి లడ్డూ కల్తీ వివాదంతో వైసీపీ అధినేత ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వైసీపీని వీడుతున్న నేతలు టీడీపీ, జనసేనలో చేరుతున్నారు. గతంలో రెచ్చిపోయిన నేతలు చాలామంది ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఇదే టైంలో.. జగన్‌కు మరో షాక్ ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం రెడీ అవుతోంది.

కడప జిల్లాకు ఏపీలో ఎంతో చరిత్ర ఉంది. ఐతే.. ఈ జిల్లాను తన హయాంలో వైఎస్ఆర్ జిల్లాగా పేరు మార్చారు జగన్ మోహన్ రెడ్డి. తిరుమల లాంటి పవిత్రమైన అంశాల్లో అన్యుల జోక్యాన్ని పూర్తిగా చెరిపేసేందుకు.. ప్రక్షాళన చేసేందుకు నడుం బిగించిన ఏపీ కూటమి సర్కార్… కడప(Kadapa) జిల్లా పేరు విషయంలోనూ ఓ లుక్కేసినట్టు తెలుస్తోంది. వైఎస్సార్‌ జిల్లా(YSR District) పేరును మార్చడానికి రంగం సిద్ధమవుతోంది.

బీజేపీ నేత, మంత్రి సత్యకుమార్ సీఎం చంద్రబాబు ముందు ఓ ప్రపోజల్ పెట్టారు. కడప జిల్లా ప్రాముఖ్యతను వివరిస్తూ సీఎం బాబుకు లెటర్ రాశారు. కలియుగదైవం వేంకటేశ్వరుడి సన్నిధికి చేరడానికి తొలి గడప కడప జిల్లానేనని… కడప పేరుకు ఒక చారిత్రక నేపథ్యం, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఉన్నాయనీ.. వీటి పట్ల కనీస అవగాహన లేని మాజీ సీఎం జగన్ పేర్ల పిచ్చితో జిల్లా పేరును ‘వైఎస్సార్’ జిల్లాగా మార్చడం తప్పు అని ఆయన చంద్రబాబుకు లేఖలో వివరించారు. వైఎస్సార్‌ పేరును తొలగించి కడప జిల్లాగా మార్చాలని మంత్రి సత్యకుమార్ సీఎం చంద్రబాబుకు లేఖ విన్నవించారు.

కడప జిల్లా ప్రజల మనోభావాల మేరకు జిల్లా పేరుని గెజిట్ లో మార్పులు చేసి గతంలో జరిగిన తప్పును సరిదిద్దాల్సిందిగా కోరానని ట్విట్టర్ లో తెలిపారు సత్యకుమార్. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కడప జిల్లా అభివృద్ధికి కృషి చేశారన్నది ఎవ్వరూ కాదనలేని సత్యమనీ.. కడప చారిత్రక నేపథ్యాన్ని, వై.యస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జరిగిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రెండు పేర్లు కలిసొచ్చేలా “వైఎస్సార్‌ కడప” జిల్లా(YSR Kadapa district)గా మార్చాలని కోరినట్టు తెలిపారు.

Rashmika Samantha Pushpa Item Song Regina
Rashmika Samantha Pushpa Item Song Regina