సాక్షిలో సత్తి ఫస్ట్ సెటైర్.. కెవ్వు కేక

Satti In Sakshi
Spread the love

ఏమాటకామాటే చెప్పుకోవాలి. సాక్షిలో సత్తి ఎంట్రీ బాగుంది. పోయిన చోటే వెతుక్కోవాలంటారు. ఎక్కడైతే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అవాక్కయ్యారో.. ఏ ఇన్సిడెంట్ అయితే.. ఆయన్ను బర్ బాత్ చేసిందో.. ఏ గొడవ , ఏ సందర్భం అయితే… తనను ఇబ్బందుల పాల్జేసిందో… అక్కడే మళ్లీ సత్తి మొదలుపెట్టాడు. ఫస్ట్ స్టెప్ మాత్రం నిజంగా క్యాచీగా ఉంది. గులాబీ మొక్కకు అంటుకట్టినట్టు…. చాలా వింతగా.. తనపై తానే సెటైర్ వేసుకుని.. సాక్షిలో.. నాన్న సెంటిమెంట్ ను దీనికి ముడిపెట్టి.. చాలా పద్ధతిగా అల్లేశారు మేకర్స్.

టీవీ9లో ఫాదర్స్ డే రోజు … తన ఇష్టారీతిన చేసిన స్కిట్… అది టీవీ9 మేనేజ్ మెంట్ కు నచ్చకపోవడంతో…ఆ ఛానెల్ నుంచి బయటకొచ్చాడు సత్తి. అందరికీ ఆవేళ ఫాదర్స్ డే.. నా ఒక్కడికే ప్రాబ్లమ్స్ డే అని తనపై తానే సెటైర్ వేసుకున్నాడు. న్యూస్ కాస్తా అనుకోకుండా న్యూసెన్స్ అయిపోయింది.. టైమ్ కానప్పుడు నవరంధ్రాలు మూసుకోవాలె… తండ్రిని గౌరవించే ఛానెల్ ఇది. నీకు తిరుగులేదు అని తండ్రి పాత్రలో డబుల్ రోల్ సత్తి చెప్పడం మాత్రం బాగా యాప్ట్. ఫస్ట్ ఎంట్రీ బాగుంది. చూడాలి.. మిగతా ఎపిసోడ్స్ లో ఈ మ్యాజిక్ వర్కవుట్ కావాలని కోరుకుందాం.

(Visited 195 times, 1 visits today)
Author: kekanews