వామ్మో.. ఈ అమ్మాయి నిన్న మళ్లీ పుట్టింది!

Bio Diversity Fly Over Accident
Spread the love

హైదరాబాద్ బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ పైనుంచి కార్లు బొమ్మకార్లలాగే కిందకు రోడ్డుపై పడిపోతున్నాయి. ఇటీవలే కారు ఢీకొట్టడంతో ఇద్దరు బైకర్లు పైనుంచి కిందపడిపోయి చనిపోయారు. ఇవాళ వోక్స్ వ్యాగన్ కారు.. వన్ వే ఫ్లై ఓవర్ పైనుంచి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో రోడ్డుపై బస్సుకోసం ఎదురుచూస్తున్న ఓ మహిళ ప్రాణం కోల్పోయింది. నలుగురు గాయపడ్డారు.

కారు పైనుంచి కిందపడిపోతున్న సమయంలో.. అక్కడున్న సీసీ కెెమెరాల్లో ఆ విజువల్స్ రికార్డయ్యాయి. విజువల్స్ చూస్తే..ప్రమాదం ఎంత డేంజరస్ గా జరిగిందో అర్థమవుతోంది. ఎంతో మంది తృటిలో ప్రాణాపాయం తప్పించుకున్నారు. కారు పడటానికి ముందు, ఆ తర్వాత.. క్షణాల గ్యాప్ లోనే అక్కడి నుంచి వెళ్తుండటం కెమెరాల్లో కనిపించింది.

ఓ అమ్మాయి నడుచుకుంటూ వస్తున్నప్పుడు కారు పడటం చూసి అక్కడే ఆగిపోయింది. ఆమె ఒక్క అడుగు వేసి ఉంటే.. పైనుంచి ఫ్లై ఓవర్ కర్వ్ సైన్ బోర్డ్ రాడ్డు వచ్చి ఆమె తలపై పడేదే. ఆ ప్రమాదాన్ని ఊహించలేం. అలా..ఆ అమ్మాయి.. తన ప్రాణాలను తెలియకుండానే కాపాడుకుంది. సీసీ ఫుటేజ్ చూసిన వాళ్లకు.. ఆ అమ్మాయి సేఫ్ అయిన తీరుచూసి.. అదృష్టవంతురాలు అని అనుకున్నారు. కొద్దిలో ప్రాణాపాయం తప్పించుకున్నట్టే అని అనుకున్నారు చాలామంది.

(Visited 272 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *