ఇంటిదగ్గర అభిజిత్ హంగామా… మ.. మ.. మాస్ ఫ్యాన్స్

http://www.kekanews.com/here-is-the-moments-after-biggboss-grand-finale/
Spread the love

లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ సినిమా హీరో అబిజీత్ బిగ్ బాస్ విన్నర్ అయ్యాక.. అతడి ఇమేజ్ లో భారీగా మార్పొచ్చింది.

ఫినాలే పూర్తయ్యాక.. ఇంటి దగ్గర అబిజీత్ (BigBoss Telugu 4 Winner Abijeeth) కు లభించిన స్వాగతం చూస్తే ఈ విషయం అర్థమైపోతుంది.

ఓ టాప్ హీరో జనంలోకి వస్తే ఎటువంటి పాపులారిటీ వస్తుందో… అలాంటి సీన్ కనిపించింది.

ఇలాంటి గ్రాండ్ వెల్కమ్ సందర్భం ఎన్నిరోజులుంటుందన్నది కాదు.. కానీ.. ఒక్కరోజైనా స్టార్ అయిపోయాడు కదా.. అదీ లెక్క.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విన్నర్ గా అబిజీత్ కావడంతో ఆయన ఇంటి దగ్గర సంతోషాల హరివిల్లు విరిసింది.

అబిజీత్ రాకను.. ఆయన అభిమానులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు.

ఇంటి దాకా రాకముందే.. కారునుంచి దిగకముందే… భారీ ర్యాలీ ప్లాన్ చేశారు.

ఆ కారుకు ఎదురుపడి.. స్వాగతాలు పలికారు.

అబిజీత్ అభిమానులను పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోయారు.

(Visited 107 times, 1 visits today)
Author: kekanews