స్కూటీ, యాక్టివాలతో జాగ్రత్త.. ఈ ఫుటేజ్ చూడండి

Spread the love

గేర్లు మార్చకుండా.. రయ్ రయ్ మంటూ దూసుకుపోవచ్చని చాలామంది గేర్ లెస్ స్కూటర్లు కొంటారు. హైదరాబాద్ లాంటి సిటీలకు యాక్టివాలు, స్కూటీలు లాంటి బండ్లు బాగా సూటవుతాయి. ట్రాఫిక్ లో గేర్లు మార్చే జంఝాటాలు ఏమీ లేకుండా దూసుకుపోవచ్చు. అంతా బాగానే ఉంది కానీ.. స్కూటీలతో జాగ్రత్తగా ఉండాల్సిందే.

ఎందుకంటే.. రేస్ గుంజితే.. బండి మూవ్ అవుతుంది. ఫ్రెండ్ కలిశాడని ఆపినా.. రేస్ పై చేయి పడకుండా జాగ్రత్తపడాల్సిందే. యాక్టివాలాంటి రేసు బైక్ లపై ప్రమాదాలు ఎన్నో చూశాం. ఇప్పుడు కొత్త వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఓ అమ్మాయి స్కూటీపై ఉన్నప్పుడు టెన్షన్ పడిపోయి.. ఎక్స్ లేటర్ ను పదే పదే రైజ్ చేసింది. దీంతో.. బండి గోడెక్కినంతపనైంది. అమ్మాయైతే.. దెబ్బలు తప్పించుకుంది. ఇలాంటి పొరపాట్లు మీరుమాత్రం ఎప్పుడూ చేయకండి. మీ ఫ్రెండ్స్ కు కూడా చెప్పండి. వీడియో కోసం కింద లింక్ చూడండి.

(Visited 285 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *