కరోనాను జయించిన బాలాపూర్ సీఐ.. వినండి ధైర్యం వస్తుంది

Balapur CI Sudhir Krishna Wins Corona Virus Disease
Spread the love

కరోనా వైరస్ అంటేనే భయంతో వణికిపోతున్నారు ప్రజలు. వైరస్ సోకి.. వ్యాధి బారిన పడితే.. ఎలా అని టెన్షన్ పడిపోతున్నారు. ప్రైవేటు హాస్పిటల్ లో లక్షలు వసూలు చేస్తారని.. ప్రభుత్వ హాస్పిటళ్లలో ట్రీట్ మెంట్ ఎలా ఉంటుందోననీ.. అసలు వ్యాధి లక్షణాలు ఏం చేస్తాయో అనే టెన్షన్ అందరిలనూ ఉంది. ఐతే.. కరోనా వైరస్ బారిన పడిన బాలాపూర్ సీఐ సుధీర్ కృష్ణ కొవిడ్ 19ను జయించాడు. ఆయన తాను ఎలా ఎదుర్కొని బయటపడ్డాననేది వివరంగా చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశాడు.

తాను మే 20న జలుబుతో టెస్ట్ చేయించుకుంటే కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందన్నాడు బాలాపూర్ సీఐ సుధీర్ కృష్ణ. ఆ తర్వాత గాంధీలో జాయిన్ అయ్యానన్నాడు. సీపీ ఫోన్ చేసి.. అండగా ఉంటామని ధైర్యం చెప్పారని అన్నాడు. 14రోజుల పాటు గాంధీలో ట్రీట్ మెంట్ తీసుకోవడంతో నెగెటివ్ వచ్చిందన్నాడు. తర్వాత ఇంట్లోనూ 14రోజులు హోమ్ క్వారంటైన్ అయ్యానని చెప్పాడు. మొదట్లో డిప్రెషన్ అనిపించినా.. ఆ తర్వాత.. మానసిక ప్రశాంతత పెంచుకున్నానని అన్నాడు. యోగా,ధ్యానం, వ్యాయామం చేస్తూ.. పోషకాహారం తీసుకుని కరోనా నుంచిబయటపడ్డానని చెప్పాడు. ప్రధానంగా మెంటల్ టెన్షన్ లేకుండా ఉన్నట్టయితే..ఇమ్యూనిటీ త్వరగా బూస్టవుతుందని చెప్పాడు సీఐ. ఆయనేమన్నాడో మీరే కిందవీడియోలో చూడొచ్చు.

(Visited 59 times, 1 visits today)
Author: kekanews