టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్లగణేశ్ కు కరోనా సోకింది. వైరస్ లక్షణాలు బయటపడటంతో.. ఆయన ప్రైవేటు హాస్పిటల్ లో టెస్టులు చేయించుకున్నారు. ఐతే.. ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
బండ్లగణేశ్ కొద్దిరోజుల కిందటే రాజకీయాల్లో రిటైర్మెంట్ తీసుకున్నారు. ఫిలిం ఇండస్ట్రీ వైపు టర్న్ తీసుకున్నారు. లాక్ డౌన్ టైమ్ లో సైలెంట్ అయ్యారు. సినీ ప్రముఖులు, ప్రభుత్వంతో జరిగిన షూటింగ్ చర్చల్లో పాల్గొన్నారు. తాజాగా కరోనా లక్షణాలతో ఆయన టెస్టులు చేయించుకున్నారు. కరోనా పాజిటివ్ గా తేలడంతో.. ప్రైవేటు హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు.