అమేజాన్ ప్రైమ్ లో అనుష్క ‘నిశ్శబ్దం’ సినిమా.. భారీ రేటు పలికిన రైట్స్

Nishabdam amazon prime
Spread the love

అనుష్క, మాధవన్ , అంజలి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా నిశ్శబ్దం. అనుష్క ప్రధాన పాత్ర పోషించడంతో.. మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్, టీజర్ కూడా ఆకట్టుకునేలా ఉండటంతో… ప్రి బిజినెస్ కూడా బాగానే జరిగింది. ఐతే.. కరోనా లాక్ డౌన్ తో నిశ్శబ్దం సినిమా థియేటర్లలో విడుదలకు నోచుకోవడం లేదు. దీంతో.. మూవీని ఎలాగైనా ఆడియన్స్ కు చేర్చాలని ప్రొడ్యూసర్స్ డిసైడయ్యారు.

నిశ్శబ్దం మూవీకి మంచి క్రేజ్  ఉండటం.. థియేటర్స్ ఇప్పట్లో ఓపెన్ అయ్యే సూచనలు లేకపోవడం.. తెరుచుకున్నా.. జనం వస్తారా అనే సందేహాల మధ్య ఇప్పటికే సినిమా తీయడం పూర్తయిన దర్శక , నిర్మాతలు.. ఓటీటీ వైపు చూస్తున్నారు. ఓటీటీలకు మంచి డిమాండ్ ఉండటం.. జనం కూడా లాక్ డౌన్ టైమ్ లో అవే చూస్తుండటంతో.. నిశ్శబ్దం మూవీని కూడా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ చేయాలని డిసైడయ్యారు దర్శకనిర్మాతలు.

నిశ్శబ్దం దర్శక నిర్మాతలు.. అమేజాన్ ప్రైమ్ తో డిస్కషన్స్ పూర్తిచేశారు. కొనుగోలు ఒప్పందం రూ.26.5 కోట్లకు కుదిరింది.  ఓటీటీ ప్లాట్ ఫామ్ పైనా అనుష్క సినిమా మంచి బిజినెస్ చేస్తుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.  Amazon Primeలో జూన్ , జులో తొలిసారి టెలికాస్ట్ చేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఆల్ ద బెస్ట్ అనుష్క.

(Visited 94 times, 1 visits today)
Author: kekanews