సిత్తరాల సిరపడు… పాటలోని పదాలకు అర్థాలు ఇవే

Sittharala Sirapadu Song
Spread the love

అలవైకుంఠపురములో.. సినిమాలో క్లైమాక్స్ లో వచ్చే జానపద పాట సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఈ లిరికల్ వీడియో సాంగ్ ను యూట్యూబ్ లో  రిలీజ్ చేసింది మూవీ టీమ్. ఇలా రిలీజైందో.. అలా… ట్రెండింగ్ లోకి వచ్చేసింది ఈ పాట. మూవీనుంచిబయటకొచ్చే ప్రేక్షకుడికి సినిమాపై మంచి ఇంపాక్ట్ కలిగేలా చేసింది ఈ పాట. శ్రీకాకుళం జానపద పాటల్లో ఇదీ ఒకటి. పాటలోని పదాలకు చాలామందికి అర్థాలు తెలియడం లేదు. ఈ మొత్తం పాటనీ… పాటలోని మాటలకు అర్థాన్నికింద చూడొచ్చు.

—————————-

సిత్తరాల సిరపడు సిత్తరాల సిరపడు
పట్టుబట్టినాడ ఒగ్గనే ఒగ్గడు
పెత్తనాలు నడిపేడు చిత్తరాల సిరపడు
(మంతనాలు చేసినాడు చిత్తరాల సిరపడు)
ఊరూరు ఒగ్గేసినా ఉడుంపట్టు ఒగ్గడు
(ఊరూరు ఒగ్గేసినా ఉద్దండుడు ఒగ్గడు)

ఆఆఆఆ… ఆఆఆఆ…

బుగతోడి ఆంబోతు
రంకేసి కుమ్మబోతె
బుగతోడి ఆంబోతు
రంకేసి కుమ్మబోతె
కొమ్ములూడదీసి మరీ
పీపలూదినాడురో

జడలిప్పి మర్రి చెట్టు
దెయ్యాల కొంపంటే
జడలిప్పి మర్రి చెట్టు
దెయ్యాల కొంపంటే
దెయ్యముతో కయ్యానికి
తొడగొట్టి దిగాడు

ఆఆఆఆ… ఆఆఆఆ…

అమ్మోరి జాతరలో
ఒంటితల రావణుడు
అమ్మోరి జాతరలో
ఒంటితల రావణుడు
గుంటలెంట పడితేను
గుద్ది గుండ సేసినాడు
గుంటలెంట పడితేను
గుద్ది గుండ సేసినాడు

(వరదలో గుంటగాళ్ళు
చిక్కుకోని బిక్కుమంటె
వరదలో గుంటగాళ్ళు
చిక్కుకోని బిక్కుమంటె
ఈడీదుకుంటు పోయి
ఈడ్చుకొచ్చినాడురో
ఈడీదుకుంటు పోయి
ఈడ్చుకొచ్చినాడురో)

పొన్నూరు వస్తాదు
దమ్ముంటే రమ్మంటే
పొన్నూరు వస్తాదు
దమ్ముంటే రమ్మంటే
రొమ్ము మీదొక్కటిచ్చి
కుమ్మికుమ్మి పోయాడు
రొమ్ము మీదొక్కటిచ్చి
కుమ్మికుమ్మి పోయాడు

ఆఆఆఆ… ఆఆఆఆ…

పదిమంది నాగలేని
పదిమూర్ల సొరసేప
పదిమంది నాగలేని
పదిమూర్ల సొరసేప
ఒడుపుగా ఒంటిసేత్తో
ఒడ్డుకట్టుకొచ్చినాడు
ఒడుపుగా ఒంటిసేత్తో
ఒడ్డుకట్టుకొచ్చినాడు

సాముసెసే కండతోటి
దేనికైనా గట్టిపోటీ
సాముసెసే కండతోటి
దేనికైనా గట్టిపోటీ
అడుగడుగు యేసినాడా
అదిరేను అవతలోడు

సిత్తరాల సిరపడు సిత్తరాల సిరపడు
ఉత్తరాన ఊరిసివర సిత్తరాల సిరపడు
గండుపిల్లి సూపులతో
గుండెలోన గుచ్చాడు

సక్కనమ్మ ఎనకబడ్డ
పోకిరోళ్ళ ఇరగదంతె
సక్కనమ్మ ఎనకబడ్డ
పోకిరోళ్ళ ఇరగదంతె
సక్కనమ్మ కళ్ళల్లో
యేలయేల సుక్కలొచ్చె
సక్కనమ్మ కళ్ళల్లో
యేలయేల సుక్కలొచ్చె

చిత్రం : అల వైకుంఠపురములో (2020)
సంగీతం : ఎస్.ఎస్.థమన్
సాహిత్యం : విజయ్ కుమార్ బల్ల
గానం : సూరన్న, సాకేత్ కొమండూరి

()లో ఉన్న లైన్స్ సినిమాలోనివి ఈ ఆడియో లో లేవు. ఈ శ్రీకాకుళం జానపదంలో  కొన్ని అర్ధాలు ::

ఒగ్గడు = వదలడు, మంతనాలు = చర్చలు, బుగత = భూస్వామి/రైతు, ఆంబోతు = ఎద్దు, పీప = కొమ్ముబూర / సన్నాయి,
గుంటలెంట = అమ్మాయిలవెంట, గుండ = పొడి, గుంటగాళ్ళు = పిల్లలు, నాగలేని = లాగలేని.

 

(Visited 675 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *