పాటలే దిక్కు – అందుకే మ్యూజిక్ కాన్సర్ట్.. ట్రైలర్ లో ఏముందని..?

Ala vaikunthapuramulo trailer review
Spread the love

సరైనోడు.. దువ్వాడ జగన్నాథమ్.. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. ఈ మూడు సినిమాలు బడ్జెట్ సినిమాలే. భారీ యాక్షన్ తో నిండిన ఎంటర్ టైనర్ సినిమాలు. వీటి ఫలితాలు ఎలా ఉన్నా… అల్లు అర్జున్ కాస్త రిలాక్సేషన్ కోరుకున్నాడు. అందుకే.. దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకుని…. ఇపుడు త్రివిక్రమ్ చెప్పిన బ్రీజింగ్ సాఫ్ట్ ఎంటర్ టైనర్ ‘అల వైకుంఠపురములో.. ’మూవీతో వస్తున్నాడు. మూవీనుంచి పర్ఫెక్ట్ ఎంటర్ టైన్మెంట్ గ్యారంటీ అంటున్నాడు అల్లు అర్జున్. ఐతే.. అంచనాలు లేని ఈ మూవీకి… తమన్ అందించిన సంగీతం.. భారీ హైప్ తీసుకొచ్చింది. సామజవరగమన పాటకు.. తమన్ సంగీతం .. సిరివెన్నెల సాహిత్యం.. ఇటీవల కాలంలో.. ఏ పాటకీ దక్కని గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. మిగతా పాటలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మ్యూజికల్ గా ముందే మూవీ హిట్టైపోయింది. అందుకే.. ప్రి-రిలీజ్ ఈవెంట్ కాకుండా… మ్యూజికల్ కాన్సర్ట్ పేరుతో… భారీ ప్రోగ్రామ్ నిర్వహించారు.

ఐతే.. సినిమాలో ఏమీ లేదా.. అంటే… అలవైకుంఠపురములో ట్రైలర్ ను బట్టి చూస్తే… అంచనాలు లేకుండా థియేటర్ కు వెళ్లడం బెటర్ అనే అభిప్రాయం కలుగుతుంది. అల్లు అర్జున్ స్టైలింగ్.. రిచ్ ఫ్రేమ్స్… కార్పొరేట్ స్టోరీ లైన్.. ట్రైలర్ లో హైలైట్ అయినవి ఇవే. ఓ మధ్యతరగతి కుర్రాడైన అల్లు అర్జున్… జీవితంలో ఆహా అనిపించే ఫీల్ కోసం ఎదురుచూస్తుంటాడు. అతడికి.. ఓ కార్పొరేట్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం లభిస్తే.. వారి కుటుంబంలో వచ్చిన ప్రాబ్లమ్ ను అతడు సొల్యూషన్ వెతికేందుకు ఎటువంటి సవాళ్లను ఎదుర్కున్నాడన్నది కథగా కనిపిస్తోంది. త్రివిక్రమ్ – పవన్ కల్యాణ్ గత సినిమాల సీన్లను కలిపితే ఈ మూవీ ఉన్నట్టుగా అనిపిస్తున్నా.. త్రివిక్రమ్ రాసిన డైలాగులు, తమన్ సంగీతం, కథనంలో ఫ్రెష్ నెస్ ఉంటే మాత్రం అల.. మూవీ సక్సెస్ అయినట్టే.

అల వైకుంఠపురుములో సంగీతం.. సామజవరగమన పాట ఇంతపెద్ద హిట్ అవుతుందని సినిమాలో ఎవ్వరం ఎక్స్ పెక్ట్ చేయలేదని అన్నాడు అల్లు అర్జున్. హిట్టయిన పాటలకు తగ్గట్టుగా.. మూవీలో ఎంటర్ టైన్ మెంట్ ఉంటుందని చెప్పారు త్రివిక్రమ్, అల్లు అర్జున్.

(Visited 159 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *