సన- సమీర… అత్తా కోడళ్లయ్యారు

Sana Sameera
Spread the love

నటి సన తెలుగు సినీ ప్రేక్షకులకు బాగా తెలిసిన యాక్ట్రెసే. సమీర కూడా టీవీ సీరియల్స్ చూసేవాళ్లకు బాగా పరిచయం ఉన్న ముఖమే. వీళ్లిద్దరు ఇపుడు అత్తా కోడళ్లయ్యారు. సన , సయ్యద్ సదుద్దీన్ ల కుమారుడు సయ్యద్ అన్వర్ తో, సమీరా షరీఫ్ నిఖా హైదరాబాద్ లో బంధు మిత్రుల సమక్షంలో నవంబర్ 10వ తేదీ రాత్రి జరిగింది.

సమీర- అన్వర్ లు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తెలుగు టీవీ సీరియల్స్ లో సమీర.. తమిళ టీవీ సీరియల్స్ లో అన్వర్.. ఇద్దరూ పాపులరే. అన్వర్ తో లవ్ లైఫ్ మొదలయ్యాక.. ఎక్కువగా చెన్నైలోనే ఉంటోంది సమీర. వీరిద్దరి ప్రేమను పెద్దలు అంగీకరించి.. పెళ్లి జరిపించారు.

పెళ్లికి అనవసర హంగులతో ఖర్చు చేయకుండా సింపుల్ గా జరిపించారు. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫ్యాన్స్ తో టచ్ లో ఉండే సమీర- అన్వర్.. తమ పెళ్లి కయ్యే ఖర్చును.. పేద పిల్లల చదువుల కోసం వెచ్చించాలని నిర్ణయించుకున్నారట. వాహ్.. కేక.

(Visited 276 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *