Must Read: సూర్య కొత్త సినిమా.. ఎవరి లైఫ్ హిస్టరీయో తెలుసా..!

Surya Akashame Nee Haddura Keka Review
Spread the love

తమిళ్ స్టార్ సూర్య కొత్త సినిమా ఆకాశం నీ హద్దురా.. టీజర్ రిలీజ్ అయింది. తొలి సినిమాతోనే ఫిలింఫేర్ అవార్డు దక్కించుకున్న డైరెక్టర్ సుధ కొంగర ఈమూవీని తెరకెక్కించారు. నిజ జీవిత కథ , సంఘటనల ఆధారంగా ఈ మూవీ నిర్మించారు. Soorarai Pottru – సూరరై పొట్రు పేరుతో తమిళ్ లో రిలీజ్ అవుతోంది ఈ మూవీ. జీవి ప్రకాశ్ కుమార్ సంగీతం అందించిన ఈ మూవీ టీజర్ ఆకట్టుకుంటోంది. సూర్య లుక్కు.. పెర్ఫామెన్స్.. టేకింగ్… బాగున్నాయి. పక్షిలా ఎగరాలని కలలుగన్న వాడిలా ఉన్న సూర్య స్టిల్ ఆకట్టుకుంటోంది.

ఇంట్రస్టింగ్ కథ

6వేల రూపాయలు జేబులో పెట్టుకుని విమానాల కంపెనీ పెడతానని ఒకడొస్తే.. ఎవడ్రా పిచ్చోడని లోకం వాడిని చూసి నవ్వింది .. అంటూ మోహన్ బాబు చెప్పే డైలాగ్ టీజర్ లో వినిపించింది. ఎయిర్ లైన్ సర్వీస్ ప్రారంభించాలని కలలు కన్న ఓ సాధారణ యువకుడు తన కలను కష్టాలకోర్చి ఎలా నిజం చేసుకున్నాడనేది ఈ కథ.

బయోపిక్ ఎవరిదంటే..

ఆకాశం నీ హద్దురా సినిమా ఓ బయోపిక్. ఎయిర్ డెక్కన్ అనే ప్యాసింజర్ విమానాల సంస్థను స్థాపకుడికి సంబంధించిన కథ ఇది. 2017లో గుజరాత్ లో విమాన సేవలు ప్రారంభించిన ఎయిర్ డెక్కన్ సంస్థ అధిపతి ఓ తమిళియన్. పేరు.. గోరూర్ రామస్వామి అయ్యంగార్ గోపీనాథ్. ఆయన ఇండియన్ ఆర్మీ వైమానిక దళంలో కెప్టెన్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన రచయిత, రాజకీయ నాయకుడు కూడా. సామాన్యుడి స్థాయి నుంచి.. ఓ ఏరో ప్లేన్ కంపెనీని స్థాపించిన అయ్యంగార్ గోపీనాథ్ గాథ స్ఫూర్తినిచ్చేదే.

మరో బయోపిక్ తో వస్తోన్న సుధ కొంగర

సాలాఖడూస్ మూవీతో తమిళంలో, హిందీలో సంచలనం రేపారు వైజాగ్ కు చెందిన సుధ కొంగర. ఫిలింఫేర్ అవార్డుతో జాతీయస్థాయిలో గుర్తింపుతెచ్చుకున్నారు. తర్వాత తెలుగులో వెంకటేశ్ తో అదే మూవీని గురుగా రీమేక్ చేశారు. ఆ మూవీ కూడా బయోపిక్. జీవితగాథలను హ్యాండిల్ చేయడంలో మంచి పట్టు ఉన్న సుధ కొంగర.. మరో బయోపిక్ తో.. సూర్యతో…ఈసారి భారీ ప్రాజెక్టు డిజైన్ చేశారు.

ఈ మూవీ టీజర్ కు.. తెలుగులో… తమిళంలో మంచి స్పందన వస్తోంది. అపర్ణ బాలమురళి, జాకీష్రాఫ్, మోహన్ బాబు, పరేష్ రావెల్ కీ రోల్స్ చేస్తున్నారు. ఈ సమ్మర్ లో ఆకాశం హద్దురా మూవీ థియేటర్లోకి రాబోతోంది.

(Visited 214 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *