బిగ్ బాస్ లో అందరి మనసులు గెల్చుకున్నాడు సింగరేణి కుర్రాడు సోహెల్. Syed Sohel.. Bigg Boss Final Contestant క్రెడిట్ కొట్టేశాడు.
ముగ్గురు ఫైనలిస్టుల్లో ఒకడైన సోహెల్ కు క్యాష్ ప్రైజ్ తో థర్డ్ ప్లేస్ తో ఫైనల్ రౌండ్ నుంచి ఎలిమినేషన్ తీసుకున్నాడు.
25లక్షల క్యాష్ ప్రైజ్ గెల్చుకోవడమే కాదు.. ఆర్ఫనేజ్ హోమ్స్ కు 10లక్షలు విరాళం ఇచ్చి తన మంచి మనసు గెల్చుకున్నాడు సోహెల్.
తర్వాత ఆ పది లక్షలు చిరంజీవి ఇస్తానని చెప్పడంతో ప్రైజ్ మనీ మొత్తం మళ్లీ సౌహెల్ పాకెట్ లోకి చేరింది.
ఫినాలే తర్వాత.. సోహెల్ ఫ్యాన్స్ మామూలుగా హంగామా చేయలేదు.
కారుపై ఎక్కించి.. ఇంటికి ర్యాలీగా తీసుకెళ్లారు.
కారుపైనే స్టెప్పులేసి.. అభిమానులను తనదైన మేనరిజమ్స్ తో అలరించాడు సోహెల్.