ఇలియానా తన భర్తలో బ్రేకప్ తర్వాత.. సినిమాల్లో బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది.
అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాల్లో బాగా లావుగా కనపడటంతో.. ఆమెపై ఇండస్ట్రీ పెద్దగా దృష్టిపెట్టలేదు. ఇపుడు తాజాగా అక్కినేని నాగార్జునతో ఓ సినిమాలో చాన్స్ కొట్టేసింది.
దీంతో… ఈ చాన్స్ ను ఎలగైనా కమర్షియలైజ్ చేసుకోవాలని ఇలియానా డిసైడైంది. లాక్ డౌన్ టైమ్ లోనూ బాగా కష్టపడింది. కసరత్తు చేసి తన ఒంటిని మళ్లీ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఇష్టపడిన షేప్ లోకి మార్చేందుకు చెమటోడుస్తోంది.
తన కష్టాన్ని ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో పంచుకుంటోంది ఇలియానా.