పవన్ కల్యాణ్, కమెడియన్ అలీ మధ్య ఫ్రెండ్ షిప్ ఈనాటిది కాదు. పవన్ సినిమాలో… అలీకోసమే క్యారెక్టర్లు కనిపెట్టి.. ఆ రోల్ ను ఆయనక ఇస్తుంటారు రైటర్లు. ఏపీలో ఆ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం.. వీరి మధ్య చిచ్చుపెట్టింది. వైస్ జగన్ కు అలీ బహిరంగంగా మద్దతు ప్రకటించడం… జనసేనను వ్యతిరేకిస్తూ మాట్లాడటం.. పవన్ తో దూరం పెంచింది. దీంతో.. ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ ను తాను మిస్ అవుతున్నట్టు చెప్పారు అలీ.
ప్రతి ఏటా ఎండాకాలంలో తన ఇంటికి మెగాస్టార్ కుటుంబం నుంచి , పవన్ కల్యాణ్ దగ్గరనుంచి మామిడి కాయలు వస్తుండేవనీ.. ఈసారి మాత్రం అలా జరగలేదని అలీ అన్నారు. పవన్ పంపే మామిడి కాయలతో.. తాము తొక్కు పెట్టుకునేవాళ్లమన్నారు. కానీ.. ఈసారి పవన్ కల్యాణ్ నుంచి తనకు మామిడి కాయలు రాలేదన్నారు. రాజకీయాల కారణంగా ఇద్దరి స్నేహబంధం కొంత దెబ్బతిన్నదని అలీ అన్నారు. బహుశా పవన్ కల్యాణ్ తన పనిలో బిజీగా ఉండి.. తన గురించి పట్టించుకులోకేపోయారేమో అని అలీ అన్నారు.