కరోనా కట్టడికి రూ.50లక్షల ఎంపీ నిధులిచ్చిన బండి సంజయ
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కరోనా ను అరికట్టేందుకు ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.50 లక్షల చెక్కును జిల్లా కలెక్టర్ కు అందించిన ఎంపీ బండి సంజయ్ కుమార్.వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం,జిల్లా అధికారులు చేస్తున్న సేవలకు అండగా నిలవాలన్న ఉద్దేశంతో ఈ నిధులను అందించినట్టు తెలిపారు.ఈ నిధులను వైరస్ కట్టడికి వినియోగం చేయాలని కోరారు.ప్రజలందరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా సహకరించాలని కోరారు. వైరస్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ప్రభుత్వ అధికారులకు,సిబ్బంది కి సహకరించాలని సంజయ్ విన్నవించారు.