ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మహిళా లోకానికి నీరాజనం పలికింది పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ చిత్ర బృందం. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రెండేళ్ల తర్వాత పవన్ కల్యాణ్ నటిస్తున్న సినిమా వకీల్ సాబ్. ఇటీవలే ఫస్ట్ లుక్ తో ఆకట్టుకున్న మూవీటీమ్… లేటెస్ట్ గా మగువా.. మగువా లోకానికి తెలుసా నీ విలువా అనే లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేసింది.
ఆమె గొప్పతనాన్ని కీర్తిస్తూ సాగే ఈ పాటను.. ప్రముఖ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి రాశారు. తమన్ ట్యూన్ చేసిన ఈ పాటను.. సిద్ శ్రీరాం ఆకట్టుకునేలా పాడారు.
ఈ పాట యూట్యూబ్ లో వైరల్ అయ్యింది. 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో లైక్స్ కామెంట్స్ వ్యూస్ దక్కించుకుంది.