టాలీవుడ్ తాజా సంచలనం … అనిల్ రావిపూడి ఇంట డబుల్ సంతోషం వెల్లివిరుస్తోంది. ఆయన రెండోసారి తండ్రి అయ్యాడు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో అనిల్ రావిపూడి భార్య భార్గవి మగబిడ్డకు జన్మనిచ్చింది.
F2 అనే టైటిల్.. తన సినిమాకు ఎందుకు పెట్టుకున్నాడో గానీ.. అనిల్ రావిపూడికి ఆ టైటిల్ బాగా సరిపోయింది. ఆయన తాజాగా రెండోసారి తండ్రి అయ్యాడు. అనిల్ రావిపూడి దంపతులకు ఇప్పటికే ఆడబిడ్డ ఉంది. అలా.. Father2 అయ్యాడన్నమాట.
అనిల్ రావిపూడి కామెడీ సినిమాలు తీసి తనకంటూ ప్రత్యేక గుర్తింపుతెచ్చుకున్నాడు. ఎఫ్ 2తో టాప్ రేంజ్ కు వచ్చిన అనిల్ రావిపూడి…. సరిలేరు నీకెవ్వరుతో మొదటిసారి మహేశ్ బాబు లాంటి బ్లాక్ బస్టర్ స్టార్ తో పనిచేశాడు. ఈ ప్రాజెక్టే ఆయన కెరీర్ ను మలుపుతిప్పేది కావడం ఆయన కుటుంబంలో సంతోషం నింపింది. సంక్రాంతి పండుగ వేళ సరిలేరు నీకెవ్వరు రిలీజ్ అవుతున్న టైమ్ లో వారసుడు పుట్టడం ఆ కుటుంబంలో సంతోషాన్ని డబుల్ చేసింది.
Thank u so much sir 🤗🤗..it Means a lot… https://t.co/64J6u626Hu
— Anil Ravipudi (@AnilRavipudi) January 5, 2020