విజయ్ దేవరకొండ(వీడీ అందాం షార్ట్ కట్ లో), రష్మిక జోడీకి సినిమాల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వారిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గీతగోవిందం సినిమా తెలుగులో ఓ బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా నిలిచిపోయింది. విజయ్ దేవరకొండ- రష్మిక కాంబినేషన్ లో తర్వాత వచ్చిన డియర్ కామ్రేడ్ కూడా కమర్షియల్ గా సక్సెస్ అయింది. వీరిద్దరికీ తమిళంలోనూ పిచ్చ ఫాలోయింగ్ ఉంది. సౌత్ లో మూడు, నాలుగు భాషల్లో రిలీజ్ అవుతుంటాయి వీళ్ల మూవీస్. తమిళంలో ఇటీవల ఓ అవార్డుల ఫంక్షన్ లో ఈ జోడీ మెరిసింది.
డియర్ కామ్రేడ్ మూవీలో నటనకు గానూ రష్మికకు బెస్ట్ యాక్ర్టెస్ అవార్డ్ అందించింది బిహైండ్ వుడ్స్ టీవీ. ఈ అవార్డుల వేడుక కలర్ ఫుల్ గా జరిగింది. విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరూ స్టేజిపై చేసిన హంగామా అంతా ఇంతా కాదు. వచ్చిరాని తమిళంలో రష్మిక చేసిన అల్లరికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. వీడీ డీసెంట్ లుక్ తో కిర్రాక్ అనిపించాడు. యాంకర్స్ కేోరికమేరకు… గీతగోవిందం మూవీలోని ఏంటీ ఏంటీ.. పాటకు వీరిద్దరూ అలా తమదైన స్టైల్ లో నడిచారు. అంతే.. ఆడిటోరియం అల్లాడిపోయింది. రష్మిక ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ కూడా కెవ్వు కేక. మీరూ చూడండి ఆ హంగామా ఏంటో.