బంధాల పొదరిల్లు.. 6 టీవీ బతుకమ్మ సాంగ్

బతుకమ్మ పండుగ వేళ ప్రత్యేకంగా పాటలను తీర్చిదిద్ది విడుదల చేస్తున్నారు. ఈసారి కూడా బతుకమ్మ కొత్తపాటల సందడి అంతటా కనిపిస్తోంది. బతుకమ్మ సందర్భంగా మెలోడీ పాటలు అందించే 6 టీవీ ఈసారి కూడా మరోసారి అలాంటి కొత్త పాటతో వచ్చేసింది.

“తొలికోడి కూసింది నిద్దుర లేరో.. మన చింతల బాయికాడ పువ్వులు దేరో…మన అక్కా చెల్లెళ్ల పండగ ఇదిరో.. వాళ్ల నవ్వుల్లో బతుకమ్మ ఇకసిస్తదిరో…” అనే సాకితో మొదలయ్యే పాట.. ఆకట్టుకుంటుంది.

“సిటసిట కురిసేటి సినుకోలే నవ్విందమ్మా.. గౌరమ్మా.. సింగిడిలో నవ్వులనే తనలో చూపిస్తుందమ్మా.. గౌరమ్మా.. ” అంటూపాట సాగిపోతుంది. బతుకమ్మ పండుగ అంటేనే బంధాల పొదరిల్లు. ఉద్యోగం కోసం ఎక్కడెక్కడెక్కడికో పోయినవారంతా… బతుకమ్మ పండుగ వేళ తిరిగి తమ సొంతిళ్లకు వస్తుంటారు. బంధువులు, స్నేహితులు అందరినీ కలుసుకుంటారు. అలా ఆ బంధాల్లోని మాధుర్యాన్ని ఈ పాటలో చక్కగా చూపించారు దర్శకుడు చందు తూటి. పండుగ తెచ్చే కళను.. బతుకమ్మ పేర్పును.. పల్లె వాతావరణాన్ని అందమైన ఫ్రేమ్స్ లో బంధించారు.

వాణి కిశోర్ వొల్లాల మరోసారి తన గాత్రంతో ఆకట్టుకున్నారు. 2016లో వచ్చిన సూపర్ హిట్ పాట ఘల్లుఘల్లున గాజుల చప్పట్లతో ఓ నిర్మల.. పాటలాగే ఈ పాటను కూడా ఆకట్టుకునేలా ఆలపించారు.

సంగీతం అందించిన చరణ్ అర్జున్.. ఈ పాటను తానే రాశి గొంతు కూడా వినిపించారు. బతుకమ్మ పండుగ గొప్పదనాన్ని ఆయన వివరించారు. పండుగొస్తే.. ఇంటి లోగిళ్లకు కళ ఎలా వస్తుందో ఆయన తన కలంతో చక్కగా వర్ణించారు. పాట మధ్య మధ్యలో వినిపించే ఫోక్ వేరియేషన్ తో ట్యూన్ లో వైవిధ్యం చూపించాడు మ్యూజిక్ డైరెక్టర్. వినసొంపుగా ఉన్న ఈ పాటను మీరూ ఓసారి చూసేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఈ సూపర్ హిట్టు బొమ్మ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..?

Sat Sep 28 , 2019
గద్దలకొండ గణేశ్(వాల్మీకి) సినిమాలో జర్రా.. జర్రా.. ఐటమ్ పాటతో తెలుగు సినీ అభిమానులను ఊపు ఊపేస్తోంది ఈ అమ్మాయి. వావ్ అనిపించే ఎక్స్ ప్రెషన్స్… అదిరిపోయే స్టెప్స్… కళ్లు జిగేల్మనిపించే గ్లామర్… చూపుతోనే మాయ చేసేకళ్లు… ఇలా… ఎవరీ అమ్మాయి… దర్శకుడు హరీష్ శంకర్ ఎక్కడినుంచి పట్టుకొచ్చాడు లాంటి ఎన్నో ప్రశ్నలు చాలామందిలో వచ్చాయి. వాల్మీకి ప్రమోషన్స్ ను బాగా గమనించినవారికి మాత్రమే ఈ సంగతి తెలుసు. కానీ చాలామందికి […]

Chief Editor

Johny Watshon

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Ut enim ad minim veniam, quis nostrud exercitation ullamco laboris nisi ut aliquip ex ea commodo consequat. Duis aute irure dolor in reprehenderit in voluptate velit esse cillum dolore eu fugiat nulla pariatur