1980 తారల గెట్ టుగెదర్.. చిరంజీవి పార్టీ

Spread the love

సినిమా స్టార్లు ఒకరిద్దరు కనిపిస్తేనే ఆ సందడి వేరు. అలాంటిది… 1980ల్లో అలరించిన స్టార్లందరూ ఒక్కచోట మెరిశారు.  మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ లో వీరిందరికీ తన ఇంట్లో నవంబర్ 24వ తేదీ సాయంత్రం పార్టీ ఇచ్చారు. వీళ్లంతా ఇలా సమావేశం కావడం ఇది పదోసారి అని చెబుతున్నారు.

కళ్లు జిగేల్..

1980ల్లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో సంచలనాలు సృష్టించిన స్టార్లు…  అన్ని భాషల్లోనూ మేటి నటులుగా, లెజెండ్స్ గా పేరుతెచ్చుకున్నారు.  చిరంజీవి, మోహన్ లాల్, వెంకటేశ్, జాకీష్రాఫ్, జగపతి బాబు, నరేష్, సురేష్ , ప్రభు, రఘు(రెహమాన్),  రమేష్ అరవింద్, సుమన్, జయరాం, ఖుష్బూ, అంబిక, రాధ, రాధిక, సుహాసిని, శోభన, మేనక, లిజి, జయసుధ, జయప్రద, ప్రియదర్శన్, సుమలత, నదియ, శరత్ కుమార్, రేేవతి.. ఇలా చాలామంది వచ్చారు. బాలకృష్ణ హాజరు కాలేదు.

ఆకట్టుకున్న డ్రెస్ కోడ్

స్టార్లంతా డ్రెస్ కోడ్ ఫాలో అయ్యారు. బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో వేసుకున్న డ్రెస్సులతో ఫొటోషూట్లలో పాల్గొన్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందరూ తమ తమ వాల్స్ లో ఫొటోలు అభిమానులతో పంచుకున్నారు. నా ప్రియమిత్రుడు మెగాస్టార్ చిరంజీవితో నేను అంటూ.. ఆయన భుజాల మీద చేతులేసిదిగిన ఫొటోను మోహన్ లాల్ పోస్ట్ చేశారు.

నెల రోజులకు ముందే వాట్సప్ గ్రూప్ లలో చిరంజీవి సహా స్టార్లంతా కోఆర్డినేట్ చేసుకుని రీయూనియన్ మీటింగ్ పెట్టుకున్నారట. కొత్త ఇంట్లోకి చిరంజీవి వెళ్తున్న టైమ్ లో వీరందరినీ పిలిచి విందు ఇచ్చాడని టాక్.

(Visited 155 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *